షూటింగ్‌లో వ‌రుణ్ సందేశ్‌కు తీవ్ర గాయాలు… ఆందోళ‌న‌లో టాలీవుడ్‌…!

హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా పరిచయం అయ్యాడు హీరో వరుణ్ సందేశ్. తొలి సినిమాతోనే యూత్‌లో బాగా పాపుల‌ర్ అయ్యాడు. ఆ వెంట‌నే కొత్త బంగారులోకం సినిమాతో మ‌రో సూప‌ర్ హిట్ కొట్టాడు. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో స‌క్సెస్‌లు రాలేదు. హీరోగా నిల‌దొక్కుకోలేదు.

This is what Varun Sandesh's wife Vithika Sheru said on her suicide attempt  rumours Latest/Breaking News Today | Bollywood News – India TV

అనంత‌రం త‌న‌తో క‌లిసి న‌టించిన హీరోయిన్ వితికా షెరును ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జంట బిగ్‌బాస్ హౌస్‌లోకి కూడా వెళ్లివ‌చ్చింది. ఆ త‌ర్వాత మ‌రింత పాపుల‌ర్ అయ్యింది. తాజాగా వ‌రుణ్ న‌టిస్తోన్న సినిమా ది కానిస్టేబుల్. జాగృతి మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మాణం అవుతున్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది.

ఓ ఫైటింగ్ సీన్ షూట్ చేస్తోన్న క్ర‌మంలో వ‌రుణ్ కాలికి బ‌ల‌మైన గాయం అయ్యింది. అయితే వెంట‌నే వ‌రుణ్‌ను చికిత్స కోసం హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు యూనిట్ స‌భ్యులు. వైద్యం అందించిన డాక్ట‌ర్లు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వ‌రుణ్‌కు సూచించారు. దీంతో కానిస్టేబుల్ షూటింగ్ అర్దాంత‌రంగా ఆపేయాల్సి వ‌చ్చింది.

Varun Sandesh & Vithika Sheru Wedding Date Revealed

గాయం కాస్త బ‌లంగానే త‌గిలింద‌న్న వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో టాలీవుడ్‌లో వ‌రుణ్ స‌న్నిహితుల‌తో పాటు కొంద‌రు యంగ్ హీరోలు వ‌రుణ్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్ప‌డంతో పాటు ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇక ది కానిస్టేబుల్ సినిమా విష‌యానికి వ‌స్తే పూర్తిగా పల్లెటూరి వాతావరణం లో నిర్మాణం అవుతున్న ఈ సినిమా ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుంది.