ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఏ హీరోలు ఏ ఏ సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారో..? ఎక్కడెక్కడ షూటింగ్స్ జరుగుతున్నాయో..? అని తెలుసుకోవాలని ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. అయితే ఒకసారి టాలీవుడ్ మూవీస్ షూటింగ్ అప్డేట్స్ చూద్దాం రండి.
VT 13 :
మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు. కాగా వరుణ్ ప్రస్తుతం మానుషి చిల్లర హీరోయిన్ గా తన 13వ సినిమా అర్జున షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లోని 7 ఎకరాల్లో జరుగుతుంది.
Nani 30 :
నాచురల్ స్టార్ నాని.. ఇటీవల దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం తన 30 వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నానికి జంటగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది.
Sharwa 35:
ఇటివల రక్షిత రెడ్డిని వివాహం చేసుకొని వివాహ జీవితంలోకి అడుగుపెట్టాడు శర్వానంద్. ప్రస్తుతం కృతి శెట్టి జంటగా తన 35వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుపుకుంటుది.
Devara :
ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎన్టీఆర్ 30వ సినిమా దేవర ప్రస్తుతం పడవ సీన్ కు సంబంధించిన షూటింగ్ సీక్వెన్స్ శంషాబాద్ ఏరియాలో జరుపుకుంటుంది.
Bhagavanth kesari :
బాలకృష్ణ హీరోగా శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తున్న భగవాన్ కేసరి సినిమా కి సంబంధించిన అర్జున్ రాంపాల్ సీన్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు బాలయ్య. ప్రస్తుతం ,ఈ సినిమా షూటింగ్ కొండాపూర్, ఏఎఫ్ ఏరియాలో జరుగుతుంది.
Eagle :
అనుపమ పరమేశ్వరన్ జంటగా రవితేజ ఈగల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా నైట్ షూటింగ్ ఏఎఫ్, కొండాపూర్ ఏరియాలో జరుగుతుంది.
Pushpa 2 :
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 దా రూల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమా సీక్వెన్స్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.
OG :
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న ఓ జి సినిమా ప్రస్తుతం నాన్ లిడ్ రోల్ యాక్టర్స్ తో హైదరాబాదులో షూటింగ్ జరుగుతుంది.
VD 12 :
ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఆ సినిమాతో పాటే తన 12వ సినిమా షూటింగ్లో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది.