బుల్లితెర రియాలిటీ షోలో బిగ్ బాస్ కి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో కూడా మొదట్లో బాగున్నా కానీ తర్వాత ఈ షోకు క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా గత ఆరో సీజన్ విషయంలో మాత్రం ఈ షోపై ఎన్నో విమర్శలు కూడాా వచ్చాయి. ఇక గత సీజన్లో అసలు విషయం లేదంటూ చప్పగా సాగిందని విమర్శలు కూడా వచ్చాయి. ప్రేక్షకులు కూడా ఈ షోని అంతగా పట్టించుకోలేదు. దీనికి ముఖ్య కారణం గుర్తింపు లేని కంటెస్టెంట్లను తీసుకోవడం ఒక కారణమైతే, హోస్ట్ గా నాగార్జున కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పించారు.
గత మూడు సీజన్ల నుంచి ఈ షో కి నాగార్జుననే హోస్ట్‌గా కోన్నసాగుతున్నాడు. ఇక అయన యాంకరింగ్ చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది. అంతేకాకుండా హోస్ట్‌గా నాగార్జున సరిగా చేయలేదని కామెంట్లు కూడా బలంగా వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ క్రమంలోని రాబోయే బిగ్ బాస్ 7వ సీజన్ కి హోస్ట్ ని మారుస్తున్నారని, నాగార్జున తప్పుకుంటా అన్నారని వార్తలు కూడా వచ్చాయి. నిజానికి గత సీజన్ చివర్లోనే ఈ కామెంట్లు గట్టిగా వినిపించాయి. నాగార్జున యాంకరింగ్ కూడా ప్రేక్షకులకు నచ్చని నేపథ్యంలో ఈ షో నిర్వాహకులు కూడా హోస్ట్‌గా నాగార్జునను మార్చే ఆలోచనకు వచ్చారని తెలుస్తుంది.
ఇక అదే సమయంలో నాగార్జున స్థానంలో రానా పేరు బాగా వినిపించింది ఇక తర్వాత మరో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు కూడా బిగ్ బాస్ హోస్ట్‌గా తెరపైకి వచ్చింది. అలాగే వీరిద్దరే కాకుండా నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు కూడా బిగ్ బాస్ హోస్ట్ గా గట్టిగా వినిపించింది. దీనికి ప్రధాన కారణం బాలకృష్ణ బుల్లితెరపై తొలిసారిగా చేసిన అన్‌స్టాపబుల్ షో ఏ స్థాయిలో సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. దీంతో బాలకృష్ణని కూడా బిగ్ బాస్ 7 హోస్ట్ గా తీసుకుంటున్నారని వార్తలు గట్టిగా వినిపించాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే సీజన్‌కు కూడా నాగార్జున నే హోస్ట్‌గా కొనసాగుతారని తెలుస్తుంది. నాగార్జునను మార్చే ప్రసక్తే లేదని బిగ్ బాస్ నిర్వహకులు ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చేసారట. నాగార్జున కూడా హోస్ట్‌గా కంటిన్యూ అవుతాడని .. సిద్ధమయ్యాడని గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో మరింత జోష్‌తో ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నాడట. ఈ సీజన్ కూడా హోస్ట్ గా నాగార్జున అయితే ప్రేక్షకులను ఏ విధంగా ఈ షోను వీక్షిస్తారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!!