ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. పటాస్ సినిమాతో డైరెక్టర్ గా తన కెరీర్‌ను మొదలుపెట్టి వరుస విజయాలతో టాలీవుడ్ లోనే రాజమౌళి తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. అందరి అందరి దర్శకులుగా రొటీన్ మాస్ మసాలా సినిమాల వెంట పడకుండా కంటెంట్ కామెడీ ఉన్న సినిమాలను చేసుకుంటూ స్టార్ హీరోలను సైతం తన అభిమానులుగా మార్చేసుకున్నాడు.
ప్రజెంట్ ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నటసింహం నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి అనే మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిపోగానే మరో నందమూరి స్టార్ హీరో తన తర్వాత సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నందమూరి హీరోతో తన సినిమాను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఆ నందమూరి హీరో మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమా తర్వాత ఎన్టీఆర్ తోనే తన తర్వాత సినిమా చేయబోతున్నాడట.
ఎన్టీఆర్ కూడా సినిమా కథను చెప్పగా ఆయన కూడా ఇంప్రెస్ అయ్యాడని. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్, హృతిక్ రోషన్‌తో వార్2 సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే అనిల్ రావిపూడి సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడట. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి సైతం బాలయ్యతో సినిమాను త్వరగా కంప్లీట్ చేసి ఎన్టీఆర్ సినిమా వర్క్‌ను మొదలు పెట్టాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడట. ఒకవేళ నిజంగా ఇదే వార్త నిజమైతే మాత్రం బాబాయ్ అబ్బాయిలతో హిట్ కొట్టిన ఏకైక దర్శకుడుగా అనిల్ రావిపూడి కూడా చరిత్రలో నిలిచిపోతాడు. మరి ఈ వార్తపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి..?