చెల్లి పెళ్లిపై వనిత విజయ్ కుమార్ హాట్ కామెంట్స్ ..అంత మాట అనేసింది ఏంట్రా బాబు..!!

వనిత విజయ్ కుమార్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెళ్లిళ్ల విషయంలో, తండ్రితో గొడవల విషయంలో ఆమె ఎప్పుడు కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. గొడవ పడడానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె పేరుని చెప్పుకోవచ్చు. వనిత చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అనేక తప్పటడుగులు వేసింది. విడాకులు ఇచ్చి మరో మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుంది. వనిత జీవితంలో చాలా మలుపులు ఉన్నాయనే చెప్పొచ్చు. అయితే మరోసారి తన గురించి ఒక ఇంట్రెటింగ్ టాపిక్ వైరల్ అవుతుంది. తన చెల్లి పెళ్లి తనే చేసిన తన చెల్లె తనని బ్లాక్ చేసిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.

My sister blocked me today if I got married close to her vanitha vijay  kumar about

వనిత తన చెల్లి అయిన శ్రీదేవి పెళ్లి చేసింది. వనిత రెండవ భర్త అయిన ఆనంద్ జయరంజన్ యొక్క ప్రాణస్నేహితుడు యొక్క చుట్టాల అబ్బాయి రాహుల్ ని శ్రీదేవి పెళ్లి చేయాలనుకుంది. అయితే మొదట్లో రాహుల్ ఇంట్లో ఒప్పుకోలేదు. సినిమా వారిని చేసుకోడానికి ముందుకు రాలేదు. అయితే వనిత వెళ్లి శ్రీదేవి అందరి లాంటి అమ్మాయి కాదని, ఆమె చాల మంచి వ్యక్తి అని చెప్పి తానే అందరిని ఒప్పించి దగ్గర ఉండి పెళ్లి చేసిందట.

Sridevi Vijaykumar Marriage Highlights || Creative Gallery - YouTube

దీనికి శ్రీదేవి తనకి మంచి కుటుంబాన్ని, మంచి భర్తని ఇచ్చినందుకు థాంక్స్ కూడా చెప్పిందంట. పెళ్లి రోజు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా తనకు ఈ పెళ్లి చేసింది వనిత అని, అందుకే ఆమెకు థాంక్స్ అంటూ పోస్ట్ కూడా పెట్టిందని వనిత చెప్పింది. కానీ ఇప్పుడు ఆస్తుల పంపకాలు జరిగి అందరు సంతోషంగా ఉన్నారని, తనకు రావాల్సిన వాటా ఇవ్వకపోగా తన తండ్రి తనను ఇంట్లో నుంచి గెంటేసాడని, పైగా శ్రీదేవి నన్ను అన్ని అకౌంట్స్ లో బ్లాక్ చేసింది అని వనిత తెలిపింది.

Stop hurting me!" - Vanitha's emotional request to Arun Vijay! - Tamil News  - IndiaGlitz.com