మెగా హీరో రామ్ చరణ్ – ఉపాసన ఈ జంట పేర్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఉపాసన ప్రెగ్నెంట్ అని చిరంజీవినే మొదటగా సోషల్ మీడియా వేదిక తెలియజేశారు. ఆ తర్వాత ఉపాసనకు సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంది. ఉపాసన బేబీ బంప్ ఇమేజెస్, సీమంతం ఇమేజెస్, ఉపాసన పుట్టబోయే బిడ్డ గురించి కూడా అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఎట్టకేలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో ఉపాసన మంగళవారం తెల్లవారుజామున 1: 49 నిమిషాలకు పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి అక్కడికి చేరుకొని తను మనవరాలుని చూసుకుని తెగ మరిసిపోయారు. అనంతరం సోషల్ మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి తన మనవరాలు పుట్టిన సమయం ఎంతో మంచిదని. అమృత గడియల్లో పుట్టిందంటు చెప్పుకొచ్చాడు. తన మనవరాలు పుట్టినందుకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు.. తమ ఆనందాన్ని వారి ఆనందంగా భావించే అభిమానులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అంటు తెలిపారు చిరంజీవి.
మా మనవరాలు మా అందరికీ నచ్చిన మంగళవారం పుట్టిందని తెలిపాడు. అదే వేదికపై మాట్లాడుతూ చిరంజీవి తన మనవరాలు పుట్టిన వేల విశేషం ముందునుంచే ప్రభావం చూపుతుందని.. రామ్ చరణ్ సినిమా పరంగా ఎదుగుదల, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్.. ఇలా అన్నీ మంచి విషయాలు జరుగుతున్నాయని ఇదంతా నా మనవరాలు మహాలక్ష్మి పుట్టడం వల్లే అంటూ పొగుడుతూ మురిసిపోయాడు చిరంజీవి. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో ఆ పాప అంత లక్కీ నా..? అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్స్.