తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది . టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన తమన్నా ప్రస్తుతం సినిమా ఛాన్స్ లు తగ్గడంతో సీనియర్ హీరో సరసన నటిస్తుంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తుంది తమన్నా. బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుందంటూ, లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ, వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే నిన్న మొన్నటి వరకు ఈ విషయాన్ని దాటేసిన తమన్న ఇటీవలే విజయ్ తో డేటింగ్ చేస్తున్నానంటూ ఒప్పేసుకుంది. తమన్నా – విజయ్ వర్మ కలిసి లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా విజయ్ వర్మ మాట్లాడుతూ తమన్నాతో డేటింగ్ లో ఉన్నట్టు అఫీషియల్ గానే ప్రకటించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయవర్మకు గతంలో ఒక స్టార్ హీరోయిన్ తో వివాహం జరిగిందంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దీనికి తోడు విజయ్ ఇంట్లో విజయ్ పెళ్లి బట్టలలో ఆ స్టార్ హీరోయిన్ తో కలిసి దిగిన ఫోటో ఫ్రేమ్ కనిపించడంతో ఈ వార్తలు మరింత జోరు అందుకున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్..? అనుకుంటున్నారా..? బాలీవుడ్ యాక్టర్స్ అలియా భట్.. ఎస్ విజయ్ ఇంట్లో అలియా విజయవర్మ కలిసి పెళ్లి బట్టలో దిగిన ఫోటో ఫ్రేమ్ ఉండడంతో చాలామంది షాక్ అవుతున్నారు. అయితే నిజానికి వారిద్దరికీ నిజంగా వివాహం జరగలేదు. విజయ్ వర్మ – అలియా భట్ కలిసి డార్లింగ్ అనే సినిమాలో నటించారట. అయితే విజయ్ వర్మ కు అలియాభట్ ఈ సినిమాలో భార్యగా నటించింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్లో వీరిద్దరూ కలిసి పెళ్లి బట్టల్లో ఫోటో దిగారట. ఈ ఫోటోను తీసుకువచ్చిన మొదట్లో విజయ్ తల్లి కూడా ఫోటోను చూసి షాక్ అయిందట. ఇకపోతే ప్రస్తుతం తమన్నా – విజయ్ వర్మ పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరు ప్రేమాయణం పెళ్లిదాకా వెళ్తుందో లేదో చూడాల్సి ఉంది..!!