నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గ్లోబల్ లైన్ గా టాలీవుడ్ లోనే సూపర్ క్రేజ్‌తోనే దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా భగవంత్ కేసరి చేస్తున్నాడు. తాజాగా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ ని కూడా విడుదల చేశారు. అందులో బాలయ్య లుక్ కూడా అదిరిపోవడంతో సినిమాపై భారీ అంచనాలు పనిచేస్తాడు అనిల్. ప్రస్తుతం ఎంతో వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అంతేకాకుండా మరో యంగ్ అండ్ సెన్సేషన్ శ్రీలీలా కూడా ఈ సినిమాలో బాలయ్య కూతురుగా నటిస్తుంది. ఇక రీసెంట్గా శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బయటికి వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యూనిట్ ఆమెకు స్పెషల్ విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లో కాజల్ ఎంతో స్టైలిష్ గా ట్రెండీ శారీలో కనిపించింది. అంతేకాకుండా ఈ సినిమాలో కాజల్ సైకాలజీ లెక్చరర్ గా కనిపించబోతున్నట్టు ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతుంది.
ఇక ఇదే సమయంలో నిన్న కాజల్ పుట్టినరోజు సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణ ఆమెకు ఎవరు ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. బాలకృష్ణ కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఓ ట్రెడిషనల్ పట్టుచీరను గిఫ్ట్ గా ఇచ్చారట. 16సంవత్సరాలగా చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలతో వర్క్ చేసిన ఏ హీరో ఇలాంటి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వలేదని బాలయ్య బాబు మాత్రం ఎంతో ప్రేమగా ఈ పట్టు చీర ఇచ్చారని ఎంతో సర్ప్రైజ్ అయిందట కాజల్.ఇక ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ గా మారింది.