రామ్ చరణ్ తన కూతురుకు ఆ స్టార్ హీరోయిన్ పేరు పెట్టాలనుకుంటున్నారా..? ఆ పేరే ఎందుకంటే..!

మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు ఎప్పుటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త రానే వచ్చింది. రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ ఈరోజు తెల్లవారుజామున 1.45 నిమిషాలకు జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీలో మూడోతరం వారసురాలు రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు రామ్ చరణ్- ఉపాసనలకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Silent strength! Mr and Mrs Ram Charan with Anjana Devi

మెగా అభిమానుల ఆనందం కూడా మామూలుగా లేదు. ఇదే స‌మ‌యంలో మెగా అభిమానులు అందరిలోనూ తలెత్తిన ఒకే ప్రశ్న రామ్ చరణ్ తన కూతురికి ఏం పేరు పెట్టబోతున్నారని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో మెగా అభిమానులు పలు రకాల పేర్లు వైరల్ చేస్తూ వస్తున్నారు.

Ram Charan turns 37: Here's a look at the Telugu actor's family photo  album-Entertainment News , Firstpost

 

మెగా ఫ్యామిలీలో పుట్టిన పిల్లలకు ఇప్పటివరకు మహా శివుడు, ఆంజనేయ స్వామి పేర్లు వచ్చేలా పెడుతూ వచ్చారు. ఇలానే ఇప్పుడు రామ్ చరణ్ పాపకి కూడా రామ్ చరణ్ నానమ్మ అంజనాదేవి పేరు వచ్చేలా అంజలి అనే పేరు పెట్టనున్నారని ప‌లు వార్తలు వస్తున్నాయి. ఈ పేరు అంటే కూడా రామ్ చరణ్ కి ఎంతో ఇష్టమట. దానికి ప్రధాన కారణం వాళ్ళ నాన్నమ్మ పేరు కూడా అంజనాదేవి కాబట్టి ఖచ్చితంగా రామ్ చరణ్ ఈ వేరే ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. ఇదే సమయంలో ఇదే పెరుతో సౌత్ ఇండియాలో ఓ స్టార్ హీరోయిన్ కూడా ఉందన్న విషయం మనకు తెలిసిందే.