కారణం ఏదైనా కావచ్చు సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంత సవ్యంగా ముందుకు స్వాగతం లేదని టాలీవుడ్లో గత 7, 8 నెలలుగా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ చివరిసారిగా డైరెక్ట్ చేసిన అలవైకుంఠపురంలో సినిమా వచ్చి మూడేళ్లు దాటేసింది. మధ్యలో ఎంతో మంది డైరెక్టర్లు ఎందరో స్టార్ హీరోలు నటించిన సినిమాలు వస్తున్నాయి. అయితే ఇంకా త్రివిక్రమ్ సినిమా మాత్రం రిలీజ్ కావటం లేదు.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ చేసిన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయ్యాక త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు పెద్దపెద్ద హీరోలు సైతం సందేహించారు. త్రివిక్రమ్ పూర్తి నిర్లక్ష్యంగా ఆ సినిమా తీశారని అందుకే అట్టర్ ప్లాప్ అయిందన్న విమర్శలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్‌ను ఎంతో నమ్మి అరవింద సమేత సినిమాకు ఛాన్స్ ఇచ్చారు. వాస్తవానికి అరవింద సమేత విజయంలో త్రివిక్రమ్ రాత తీత కంటే ఎన్టీఆర్ నటనే హైలెట్ అని చెప్పాలి ఆ తర్వాత త్రివిక్రమ్ బన్నీతో అలవైకుంఠపురంలో సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు.
ఈ సినిమా అంతా సూపర్ హిట్ అవ్వటం వెనుక బన్నీ మేనరిజం బన్నీ మార్కెట్‌తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే అందాలు తమన్ సంగీతం కూడా ఎంతో కీ రోల్ ప్లే చేశాయి అన్న విషయం మనం మరువకూడదు. అలవైకుంటపురంలో సినిమా తర్వాత వెంటనే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మరో సినిమా చేయాల్సి ఉంది. సినిమా షూటింగ్ మొదలుకావడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఎక్కడో త్రివిక్రమ్ చేష్టలు ఎన్టీఆర్‌కు తేడా కొట్టేసాయి.. వెంటనే ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ సినిమాకు ఓకే చెప్పేశాడు.
అది కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా షూటింగ్ ప్రారంభమైంది. అది వేరే విషయం అయితే త్రివిక్రమ్ చేష్టలు ఎన్టీఆర్‌కు ఎందుకో నచ్చలేదు. అందుకే త్రివిక్రమ్ సినిమాకు ముందు ఓకే చెప్పేక కూడా ఎన్టీఆర్ తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాడు. అయితే మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్‌ను నమ్మి నిండా మునిగి బలైపోయినట్టే కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై చాలా నెలలు గడుస్తోంది. ఇప్పటికి అతీగతీ లేదు ఒక షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న ఫుటేజ్ సరిగా రాలేదని త్రివిక్రమ్- మహేష్‌తో చెప్పడంతో మహేష్ పూర్తి అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే సైతం తప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ కూడా మహేష్ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ సినిమాలు సెట్ చేస్తూ ఆ సినిమాలకు పని చేసుకుంటూ బాగానే సంపాదించుకుంటున్నాడని.. మహేష్ సినిమాను పూర్తి నిర్లక్ష్యంతో తెరకెక్కిస్తున్నాడన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ ఇదే విధంగా ముందుకు వెళ్లితే మహేష్ సినిమా మరో అజ్ఞాతవాసి కాక తప్పదన్న హెచ్చరికలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వెళుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఔట్పుట్ కూడా మహేష్‌కు ఏమాత్రం నచ్చలేదని భోగట్టా.