మ‌హేష్‌ను రెచ్చ‌గొడుతూ కావాల‌ని కెలుకుతోన్న బ‌న్నీ.. ఇండస్ట్రీలో కొత్త వార్ స్టార్ట్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఎంత లేదన్న ఆధిపత్య యుద్ధం అయితే గట్టిగానే నడుస్తోంది. అంతకుముందు సంగతి ఏమోగానీ అలవైకుంఠపురంలో- సరిలేరు నీకెవ్వరు సినిమాలు రెండు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. అసలు రెండు సినిమాలు పంతానికి పోయి ఒకే రోజు రిలీజ్ కావాల్సి ఉంది మధ్యలో ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకొని ఒకరోజు తేడాలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చేశారు.

ఈసినిమాల రిలీజ్ విషయంలో మహేష్- బన్నీ పోటా పోటీగా పోస్టర్లు కూడా వేసుకున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక మా సినిమా ఎక్కువ వసూళ్లు సాధించిందని చెప్పుకునే విషయంలో కూడా పోటా పోటీగా పాస్టర్లు వేసుకొని మరి ప్రచారం చేసుకున్నారు. చివరకు లాంగ్ రన్ లో మహేష్ సినిమా కంటే బన్నీ సినిమా పై చేయి సాధించింది. అప్పటినుంచి ఇద్దరి మధ్య అనేక విషయాల్లో యుద్ధం జరుగుతోంది. ఇక మహేష్, బన్నీ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లతో యుద్ధాలు చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం మహేష్- త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవడం కూడా మహేష్ కు ఇష్టం లేదు. త్రివిక్రమ్ రాజీ చేయడంతో మహేష్ అయిష్టంగా ఓకే చెప్పాడని అయితే ఇప్పుడు సడన్గా తమన్‌ను పక్కనపెట్టి జీవి ప్రకాష్ కుమార్‌ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో మహేష్ అభిమానులు కూడా త్రివిక్రమ్ మీద బాగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ టైంలో త్రివిక్రమ్ బన్నీ కలిసి చేసిన ఆహా ప్రకటన రిలీజ్ అయింది. ఇది మహేష్ ఫ్యాన్స్ ను మరింత రెచ్చగొట్టినట్టు అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ టైంలో త్రివిక్రమ్, బన్నీ సినిమా ప్రకటన ఉంటుందని దీనిపై నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన కూడా రాబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరో విచిత్రం ఏంటంటే మహేష్ వద్దనుకుంటున్న తమన్‌ను ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోబోతున్నారట బన్ని.

 

త్రివిక్రమ్- మహేష్ సినిమా విషయంలో ముందు నుంచి ఎందుకో అంత ఆసక్తిగా ఉండటం లేదన్న కామెంట్లు వస్తున్నాయి. త్రివిక్రమ్ కాన్సన్ట్రేషన్ అంతా పవన్ కళ్యాణ్ సినిమాల మీదే ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఈ టైంలో కావాలని బన్నీ- మహేష్ ను రెచ్చగొట్టేలా త్రివిక్రమ్ తో సినిమా చేయడంతో పాటు మహేష్ రెజెక్ట్ చేస్తున్న తమన్‌ను తన సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోబోతున్నాడు అన్న చర్చలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరు హీరోల ఆధిపత్య పోరు ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి..!!