ఆ రోజు కమల్ హాసన్ ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చిన శోభ‌న్‌బాబు .. అంత పెద్ద తప్పు చేశారా..?

శోభ‌న్‌బాబుకు సోగ్గాడ‌నే పేరుంది. పైగా.. త‌న అందాన్ని ఆయ‌న చెక్కుచెద‌ర‌కుండా చూసుకున్నారు. అప్ప‌టి త‌రం హీరోల‌ను గ‌మ‌నిస్తే.. శోభ‌న్‌బాబు రేంజ్‌లో ఫిజిక్‌ను మెయింటెన్ చేసిన వారు చాలా త‌క్కువ మందే ఉన్నారు. దీంతో శోభ‌న్‌బాబుకు అవ‌కాశాలు కూడా మెండుగానే వ‌చ్చేవి. ఇలా.. వ‌చ్చిన వాటిలో చాలా వ‌ర‌కు ఆయ‌న కాల్షీట్లు ఖాళీలేవ‌నే కార‌ణంగా వ‌దులుకున్నారు. అంతేకాదు.. ఆయ‌న‌కు క‌ధ‌లు కూడా పెద్ద‌గా న‌చ్చేవి కాదు.

ఇలా వదుల‌కున్న సినిమానే ఆక‌లి రాజ్యం. ఈ సినిమాకు మొద‌ట్లో శోభ‌న్ బాబును హీరోగా అనుకున్నారు. క‌థ రెడీ చేసుకున్నారు. రెండు మూడూ సిట్టింగులు కూడా అయ్యాయి. కానీ, హీరో పాత్ర‌పై కొన్ని అను మానాలు వ్య‌క్తం చేసిన శోబ‌న్‌బాబు.. చివ‌ర‌లో కొన్ని మార్పులు సూచించారు. కానీ, దీనికి ద‌ర్శ‌కుడు ఒప్పుకోలేదు. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన హీరో.. త‌న రాజీ ప‌డ‌ని ధోర‌ణితో జీవితంలో ఎదుర్కొనే అనేక సంఘ‌ట‌న‌లు ఈ సినిమాలో క‌నిపిస్తాయి.

అయితే.. ఇవి బాగానే ఉన్నా.. చివ‌ర‌కు క్షౌర‌శాల పెట్టుకోవ‌డం మాత్రం శోభ‌న్‌బాబుకు న‌చ్చ‌లేదు. ఇంకే ప‌నులూ లేవా.. హీరోకు చేసేందుకు చివ‌రిలో మార్చండి అని సూచించారు. కానీ, ద‌ర్శ‌కుడు దీనికి అంగీక‌రించ‌లేదు. దీంతో శోభ‌న్‌బాబును త‌ప్పించారు. ఈ నేప‌థ్యంలోనే బాలు మ‌హేంద్ర సూచ‌న‌ల మేర‌కు ఈ సినిమాలో రంగా పాత్ర‌కు క‌మ‌ల్‌హాస‌న్‌ను తీసుకున్నారు. ఈ సినిమా అనుకున్న‌దాని కంటే కూడా.. ఎక్కువ‌గానే ఆడింది.

100 రోజుల ఫంక్ష‌న్‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి క‌మ‌ల్ హాస‌న్ స్వ‌యంగా శోభ‌న్‌బాబు ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఆయ‌న కూడా వ‌చ్చారు. కానీ.. చివ‌రిలో క‌మ‌ల్‌ను ప‌ట్టుకుని ఏడ్చేశార‌ట‌. ఇంత బాగా ఉంటుంద‌ని తాను ఊహించ‌లేద‌ని అన్నార‌ట‌. ఏదేమైనా .. ఒక మంచి సందేశం ఉన్న సినిమాను వ‌దులుకున్నందుకు ఆయ‌న బాధ‌ప‌డ్డార‌ట‌.