యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆయన నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాని మన టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచేసాడు కొరటాల. ఈ సినిమాలు ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్లో నటించబోతున్నారని తెలుస్తుంది. అందులో ఒక పాత్రలో సముద్ర వీరుడు గా కనిపించనున్నాడు.
అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమా క్యాస్టింగ్ దగ్గర్నుంచి సీన్ల వరకు.. అన్ని పర్ఫెక్ట్ గా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట కొరటాల. ఎన్టీఆర్‌కు కొరటాలకు ఈ సినిమా విజయం ఎంతో కీలకం. రాజమౌళితో సినిమా తర్వాత హిట్ కొట్టి బ్రేక్ ఇవ్వడానికి కష్టపడుతుంటే.. కొరటాల ఆచార్య ప్లాఫ్ నుంచి బయటపడటానికి చూస్తున్నాడు. అందుకే ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా చూస్తున్నారట.
ఇప్పుడు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎప్పుడూ చేయని ఒక పెద్ద రిస్క్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అసలు విషయానికి వస్తే ఈ సినిమా కోత్త షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో త్వరలోనే మొదలుకానుంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారని కూడా తెలుస్తుంది. ఈ యాక్షన్ సీన్స్ కూడా సముద్రపు ఒడ్డున తెరకెక్కించనున్నారట. అది కూడా ఎన్టీఆర్ డూప్ లేకుండా ఈ సన్నివేశాలలో నటించబోతున్నారట.
ఈ ఫైట్‌లు ఈ సినిమాకే ఎంతో హైలెట్‌గా ఉండనుందని తెలుస్తుంది. అలాగే ఈ ఫైట్ లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ షూటింగ్లో జాయిన్ అవ్వనున్నారట. న్యాచురాలిటీ మిస్ కాకుండా ఉండటం కోసం డూప్ లేకుండా ఎన్టీఆర్ ఈ రిస్క్ చేసి మరీ ఈ సీన్స్ ను కంప్లీట్ చేయనున్నట్టు టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్- కొరటాల ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.