టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులకు ఆడపిల్ల పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ మెగా కుటుంబంలోకి మూడోతరం వారసురాలు అడుగుపెట్టింది. గత పది సంవత్సరాలుగా మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వేళ రానేే వచ్చింది. తమ అభిమాన హీరోకి ఓ పండంటి ఆడపిల్ల పుట్టడంతో అభిమానులతో పాటు మెగా కుటుంబం కూడా సంబరాలు చేసుకుంటున్నాయి.
మెగా అభిమానులు మొత్తం ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం రామ్ చరణ్- ఉపాసనలకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సమయంలోనే రామ్ చరణ్ ఆప్తమిత్రుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వీరిద్దరు కు ఎంతో స్పెషల్‌గా విషెస్ చెప్పాడు. ”తల్లితండ్రుల క్లబ్ లోకి వెల్కం అంటూ మీ బిడ్డతో ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ కూడా మీజీవితంలో ఎంతో గుర్తుండి పోతుందని ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలంటూ” సోషల్ మీడియాలో ట్విట్ చేశాడు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ -ఎన్టీఆర్‌కు గత కొన్ని రోజులకు గొడవలు జరుగుతున్నాయి అంటూ పలు వార్తలు వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టిన ఈ పోస్టు వీరి మధ్య ఏమీ లేదు అంటూ తేలిపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా. రామ్ చరణ్ కూడా వరుస సినిమాలు షూటింగ్లో బిజీగా ఉన్నాడు..!!
Congratulations @AlwaysRamCharan and @upasanakonidela. Welcome to the parents club. Every moment spent with the baby girl will be an unforgettable memory for a life time. May God bless her and you all with immense happiness.
— Jr NTR (@tarak9999) June 20, 2023