25 ఏళ్ల క్రిత‌మే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన వ‌ర్మ అట్ట‌ర్ ప్లాప్ సినిమా ఇదే.. భలే తప్పించుకున్నాడే..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల నాసిరకమైన సినిమాలు తీస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు వర్మ సినిమా వస్తుంది అంటే చాలు జనాలు పారిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడున్న సోషల్ మీడియాను బాగా వాడుకుంటూ ఎప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వర్మ లైన్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Ram Gopal Varma Age, Wife, Girlfriend, Family, Biography & More »  StarsUnfolded

సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ తో వర్మ వార్తల్లో ఉండేందుకు ట్రై చేస్తున్నాడు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎప్పుడు ఏదో ఒక కామెంట్ తో ప‌వ‌న్ పై పడే వర్మ తాజాగా పవన్ అభిమానులను గిల్లటం అంటే తనకు చాలా ఇష్టం అంటూ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాను పాతిక సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ కు కథ చెప్పానని .. ఆ కథ పవన్‌కు నచ్చలేదని వర్మ గతంలో ఓ సందర్భంలో చెప్పారు.

Pawan Kalyan's new plans for three films

పవన్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చేయటానికి ముందే వర్మ పవన్ ను కలిసి ఓ కథ చెప్పారట. జెడి చక్రవర్తి- వినీత్ హీరోలుగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “వైఫ్ ఆఫ్ వరప్రసాద్” ఈ సినిమాను రామ్‌గోపాల్ వర్మ స్వయంగా నిర్మించారు. అయితే ఈ సినిమా కథతో పవన్ కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేయాలని వర్మ అనుకున్నారు. అయితే పవన్ కు ఈ కథ నచ్చక రిజెక్ట్ చేశారట.

Wife Of V. Varaprasad Songs Free Download 1998 Telugu Movie

ఇదే విషయాన్ని పవన్ కూడా ఓ సందర్భంలో ప్రస్తావించాడు. వర్మ గారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు ఒకసారి ఆయన సినిమా చేయమని వస్తే కథ నచ్చక తను రిజెక్ట్ చేశానని అంతకుమించి వేరే విభేదాలు లేవని పవన్ కూడా తెలిపాడు. ఏది ఏమైనా పవన్ ఈ సినిమా వదులుకొని నిజంగానే మంచి పని చేశాడు. ఈ సినిమానే చేసుకుంటే పవన్ తన కెరీర్లను తొలి సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయి ఉండేది.