సాయం కావాల‌ని బాల‌య్య‌కు మెసేజ్ పెడితే ..ఫోన్ చేసి చెడామ‌డా తిట్టేశారు..ఇంట్రెస్టింగ్ విషయాని బయట పెట్టిన ప్రియ‌ద‌ర్శిని రామ్..!!

తెలుగు ప్రేక్షకులకు నటుడు దర్శకుడు ప్రియదర్శిని రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రారంభంలో బుల్లితెర నటుడిగా సంచలనాలు క్రియేట్ చేసిన ప్రియదర్శిని రామ్.. ఆ తర్వాత వెండితెరపై నటుడుగా మారి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత తన సొంత బ్యానర్ లోనే కొన్ని సినిమాలు చేశాడు దర్శకుడుగా కూడా కొన్ని సినిమాలుకు దర్శకత్వం వహించారు. అలాగే మీడియాలోనూ సంచలనాలు క్రియేట్ చేశాడు.

తాజాగా ప్రియదర్శినిరామ్‌ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి అడగగా ప్రియదర్శిని స్పందిస్తూ తనకు బాలకృష్ణతో ఎంతో సాన్నిహిత్యం ఉందని చెప్పారు. బాలకృష్ణ తన జూనియర్ అయిన తాను బాలయ్యను అన్న అని పిలుస్తానని ఆయన పసిబిడ్డ లాంటివాడని రామ్ తెలిపారు. ఒకసారి ఎయిర్పోర్ట్ లో వెళ్తుంటే దూరం నుంచి గుర్తుపట్టిన బాలయ్య బాక్సి అని పిలిచారు అని తాను బాక్సింగ్ చేసేవాడిని అని అందుకే అందరూ కాలేజీలో ఉన్నప్పుడు బాక్సి అని పిలిచేవారని చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో కూడా ఎవరో ఫోటో అడిగితే బాలయ్య కోప్పడ్డారని ఆయనకు ఫోటో దిగటం అస్సలు ఇష్టం ఉండదని ప్రియదర్శి చెప్పారు. తల్లిదండ్రులతో ఫోటోలు తీసుకోవాలి గానీ సినిమా నటులతో ఫోటోలు ఏంటయ్యా అని బాలయ్య అంటూ ఉంటారని రామ్ గుర్తు చేసుకున్నారు. ఒకసారి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో పేద పూజారికి సర్జరీ జరిగిందని డిస్కౌంట్ కావాలని బాలయ్యకు మెసేజ్ పెట్టానని రామ్ చెప్పారు. వెంటనే బాలయ్య ఫోన్ చేసి కోప్పడ్డారని ఇది నీ హాస్పిటల్ నన్ను అన్నా అంటావేంటి నీకన్నా చిన్నవాడిని నీ హాస్పిటల్ లో నువ్వు డిస్కౌంట్ అడుగుతావేంటి డిస్కౌంట్ ఇచ్చేయ్ నన్ను అడగాలా అంటూ బాలయ్య చెప్పారని ఆ సంఘటన గుర్తు చేసుకున్నారు ప్రియదర్శిని . అలా బాలయ్యది ఎంతో గొప్ప మనస్తత్వం అంటూ ప్రియదర్శిని రామ్‌ ఆకాశానికి ఎత్తేశారు..!!