బాల‌య్య పాట‌కు ర‌చ్చ చేసిన కాజ‌ల్ – శ్రీలీల‌… డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడిని ఆడుకున్నారుగా ( వీడియో )

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లను మించిన క్రేజ్‌తో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. ఆమె ఇప్పటివరకు ఈమె నటించింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో స్వింగ్‌లో ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్‌ కేసరి సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

నిన్న కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. ఇదే సమయంలో కాజల్ – శ్రీ లీల నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడిని హీరోయిన్లు ఇద్దరు ఓ రేంజ్ లో ఆడుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి గతంలో బాలయ్య పాటకు చిందేశాడు.

బాలయ్య నటించిన లారీ డ్రైవర్ సినిమాలోని బాలయ్య.. బాలయ్య.. గుండెల్లో గోలయ్య అనే పాటకు అనిల్ తనదైన స్టైల్ స్టెప్పులు వేశాడు. ఇప్పుడు దీనికి రెండింతలు ఊపునిస్తూ ఈ సినిమా హీరోయిన్లు కాజల్- శ్రీలీలా కూడా మరో బాలయ్య పాట‌కి చిందేసి అనిల్ రావిపూడికి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. అలాగే నరసింహనాయుడు సినిమాలో చిలకపచ్చ కోక అనే పాటలో వచ్చే రెండు లైన్లకు శ్రీలీల‌-కాజల్ మాస్ స్టెప్స్ తో అదరగొట్టారు. రారా ఉల్లాస వీరుడా.. నీ సోకుమాడ.. నీదే నా పట్టుపావడా అంటూ రచ్చ రచ్చ చేశారు.

 

వీరిద్దరూ డ్యాన్స్ చేస్తుంటే మధ్యలో దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చి సూపర్ అని చెప్పినా వీరిద్ద‌రు మ‌రింత రెచ్చిపోతూ డ్యాన్సులు వేశారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇద్దరు భామలు ఒకే కలర్ డ్రెస్‌లో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్యలో బాలయ్య పాట‌తో నలిగి పోయావా అనిల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో నంద‌మూరి అభిమానుల్లో మాంచి ఉత్సాహం నింపింది.