గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా బ్యాక్ గ్రౌండ్ తో సినీ ఇండస్ట్రీలకు అడుగుపెట్టిన రామ్ చరణ్ అంచలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మెగా కోడలు పిల్ల ఉపాసన గర్భవతిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి.. ఉపాసన ప్రెగ్నెంట్ అని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నుంచి ఆమెకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంది.
అయితే ప్రస్తుతం తొమ్మిదో నెలలోకి అడుగుపెట్టిన ఉపాసన నిన్న పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యింది. నిన్న సాయంత్రం అపోలో హాస్పిటల్స్ లో అడ్మిట్ అయిన ఉపాసనకు ఈరోజు తెల్లవారుజామున ఆడపిల్ల పుట్టిందంటూ ప్రస్తుతం వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పండంటి మహాలక్ష్మి కి జన్మనిచ్చిన ఉపాసన – రామ్ చరణ్ లకు మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
అయితే వారిద్దరి వివాహం ఇప్పటికే 11 సంవత్సరాలు అయిన సంగతి అందరికీ తెలిసిందే. వివాహం అయిన పది సంవత్సరాల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అని చిరంజీవి మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేయడంతో మెగా అభిమానులంతా ఆనందంలో మునిగితేలారు.. ఇప్పుడు పండంటి ఆడపిల్ల పుట్టిన సందర్భంగా మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.