తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటుంది కానీ ఒకప్పుడు మాత్రం ప్రతి ఒక్క దర్శక నిర్మాత ఈ బ్యూటీనే ఎంచుకునేవాళ్లు. స్టార్ హీరోలు సైతం అనుష్క వచ్చిన కొత్తలో ఆమెనే హీరోయిన్గా సినిమాలో తీసుకునే వారు. అయితే మధ్యలో కోత్త హీరోయిన్లు రావడంతో అంతేకాకుండా అనుష్క లుక్ లో కూడా మార్పు రావడంతో అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ ముదుగుమ్మ నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది. నిజానికి అనుష్క రియల్ నేమ్ స్వీటి. ఇక ఈమె అమ్మ నాన్న కూడా ఈమెను స్వీటీ అనే పేరు పెట్టారట . అలా స్వీటీ అనే పేరుతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈమె.. ఇండస్ట్రీలో ఈమెకు అనుష్క అనే పేరు వచ్చింది. ఇదే సమయంలో ఈమెకు ఈ పేరు రావడానికి ముఖ్య కారణం నాగార్జున అని తెలుస్తుంది. అనుష్క తొలి సినిమా నాగార్జునతోనే నటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో అనుష్క ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అనుష్కని పేరు ఏంటని అడగటంతో స్వీటీ అని చెప్పిందట. దాంతో నాగార్జున మళ్లీ నీ అసలు పేరేంటి అని అడగడంతో మళ్లీ స్వీటీ అనే చెప్పింది. దీంతో డౌట్ తో పాస్ పోర్ట్ కూడా అడిగి చెక్ చేశాడట. అందులో కూడా ఆపేరే ఉండడంతో ఈ పేరు నీకు సూట్ అవ్వదని పూరి జగన్నాథ్ ని మరో పేరు పెట్టమని అన్నాడట. అయితే అదే సమయంలో తమ స్టూడియోకి ఒక సింగర్ అనుష్క అనే అమ్మాయి రావడంతో.. నాగార్జున ఆమె పేరు విని ఈ పేరు ఎక్కడ లేదు.
ఇక స్వీటీకి ఈ పేరు పెడితే బాగుంటుంది అని అనుష్క అని పిక్స్ చేశాడట. దీంతో అనుష్క కూడా రెండు రోజులు ఆ పేరుతో నన్ను పిలవండి.. నాకు అలవాటు అవుతుందో లేదో అని అనటంతో ఆ రోజు నుంచి అనుష్క అని పిలవటంతో అదే అలవాటు అయ్యిందని తెలిసింది. అదే సమయంలో అప్పట్లో అనుష్క నాగార్జున మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు ఎన్నో వచ్చాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియలో వైరల్‌గా మరింది.