అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌ ఆ స్టార్ నిర్మాత కారణంగానే నాశనమైందా..!

నాగచైతన్య హీరోగా వచ్చిన ప్రేమమ్ సినిమాతో రింగు రింగుల జుట్టు తో బొంగరం లాంటి కళ్ళతో అందరిని కట్టిపడేసింది అనుపమ పరమేశ్వరన్ . ఈ సినిమా తర్వాత అనుపమ నితిన్ హీరోగా వచ్చిన అఆ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. అలాగే శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతి సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని ఒక్కసారిగా అనుపమ కెరీర్ మారిపోయింది.

Anupama Parameswaran Wallpaper 4K, Indian actress, People, #7642

ఈ సినిమా విజయంతో దిల్ రాజు హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది అనుపమ. ఇక అప్పటినుంచి అనుపమ కెరీర్ మొత్తం దిల్ రాజు చూసుకునేవాడు. ఏ సినిమాలో నటించాలో ఏ సినిమా చేయకూడదు అని మొత్తం ఆయనే డిసైడ్ చేసేవారట. అలా అనుపమను నానితో కృష్ణార్జున యుద్ధం, రామ్‌తో ఉన్నది ఒకటే జిందగీ, సాయిధరమ్ తేజ్ తో తేజ్ ఐ లవ్ యు, వంటి సినిమాలకు అనుపమను హీరోయిన్‌గా ఆఫర్ చేసి సెకండ్ హీరోయిన్ గా ఉండే అనుపమను స్టార్ హీరోయిన్ రేంజ్‌క‌ తీసుకెళ్లాడు దిల్ రాజు.

అలాగే దిల్ రాజు మేనల్లుడు ఆశీష్ రెడ్డి కలిసి అనుపమ రౌడీ బాయ్స్‌ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఈమె ఘాటైన లిప్ కిస్స్‌లతో రెచ్చిపోయింది. మొదటిసారిగా తన హాట్ గ్లామర్ షో తో ఇండస్ట్రీలో తన పేరును వైరల్ గా మార్చుకుంది. ఎప్పుడు పద్ధతిగా కనిపించే అనుపమ పరమేశ్వరన్‌ ఒక్కసారిగా ఇలా రెచ్చిపోవడం ఏంటని ఆమెను ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

Anupama Parameswaran's lip lock pics with producer's nephew go viral -  Tamil News - IndiaGlitz.com

ఇక ఆ సినిమా ప్లాఫ్ అవ్వడంతో అనుపమ పరమేశ్వరన్ అభిమానులు అందరూ దిల్ రాజు వల్లే అనుపమ కెరర్ నాశనమైంది అని తిట్టుకున్నారు. అనుపమ ప్రస్తుతం డీజే టిల్లు2 సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాతో కూడా మరోసారి తన హాట్ గ్లామర్ షో తో రెచ్చ కొట్టడానికి రెడీ అవుతుంది..!!