నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. బాలయ్య ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, స్టిల్స్, టీజర్ అయితే దుమ్ము రేపేశాయి.
టీజర్ వచ్చాక సినిమాపై అంతకు ముందు ఉన్న హైప్ కంటే ఏకంగా డబుల్ అయ్యింది. టీజర్ తర్వాత ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ రోజు కాజల్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కాజల్ చీరలో చాలా స్టైలీష్‌గా కనిపిస్తోంది.
చీరలో కుర్చీలో కూర్చొని ఉన్న కాజల్ చాలా హోమ్లీగా కనిపిస్తోంది. ఆమె చేతిలో సైకాలజీ పుస్తకం కూడా ఉంది. ఫోన్లో మాట్లాడుతూ సైకాలజీ పుస్తకం చదువుతున్నట్టుగా స్టిల్ ఉంది. పెద్ద పెద్ద కళ్లజోడు అద్దాలతో పాటు ఆమె నవ్వుతూ పుస్తకం చదువుతోన్న స్టిల్ ఆకట్టుకుంది.
ఈ స్టిల్ చూసినా వారంతా భగవంత్ కేసరి భార్య సైకాలజీ లెక్చర్‌గా కాజల్ పాత్ర ఉండబోతోందని అంటున్నారు. అయితే కాజల్ ఫేస్‌లో మాత్రం ఆంటీ చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి కాజల్ పెద్ద ఆంటీ అయిపోయిందనే అంటున్నారు. ఇక భగవంత్ కేసరి మూవీ దసరా కానుకగా రిలీజ్ అవుతోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.