జెడీ చక్రవర్తి..ఈయన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాలలో నటుడిగా విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయన దయ అనే సిరీస్ ద్వారా మళ్ళీ అందరిని పలకరించనున్నారు. ఇప్పడూ జెడీ చక్రవర్తి ప్రమేషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా జయసుధ గురించి చేసిన విషయాలు హాట్ టాపిక్ అయ్యాయి. అసలు జెడీ చక్రవర్తి జయసుధ గురించి ఏం మాట్లాడారో చూసేద్దామా. ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జయసుధని పెళ్లి చేసుకుంటానని జయసుధ భర్తనే అడిగారట. జయసుధ భర్త నితిన్ దగ్గరికి వెళ్లి జయసుధని పెళ్లి చేసుకుంటానని అడిగారు. జయసుధ భర్త నితిన్ సిక్స్ ఫీట్ ఉన్నారంట.
ఆయన కొడితే లేవడానికి మూడు నెలలు లేయలేను కానీ కొంచెం ధైర్యం చేసుకొని వెళ్లి అడిగాను అని జెడీ చెప్పారు. అయితే నితిన్ కి కూడా సరదాగా అడిగాను అని తెలుసు కానీ ఆయన నితిన్ ఏం చెప్పారో కూడా జెడీ చెప్పారు. నితిన్ మాట్లాడుతూ జయసుధ పెళ్లి డేట్ సరిగా గుర్తులేదు. నేను పెళ్లి చేసుకున్న డేట్ లోనే నువ్వు కూడా పెళ్లి చేసుకో అని చెప్పారు.
ఎందుకంటే మా పెళ్లి రోజు కూడా అదే పెళ్లి రోజు అవుతుంది. హస్బెండ్ మాత్రమే మారుతాడు అంటూ ఆయన సమాధానం చెప్పారు అంటూ ఈ సందర్భంగా అప్పటి విషయాలను జెడీ చక్రవర్తి గుర్తు చేసుకున్నారు. ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే జయసుధ భర్త అనారోగ్య సమస్యలతో గత కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన విషయం తెలిసిందే.