ముకేశ్ అంబానీ – నీతా అంబానీల ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ .. అన్నిటికన్నా హైలెట్ అదే..!!

దేశంలోనే అతిపెద్ద ధనవంతుడు అంటే మొదట అందరు పేరు చెప్పే పేరు ముకేశ్ అంబానీ. ఈయన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంత మంది సెలెబ్రెటీల కంటే ఈయనకి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫాలోయింగ్ తో పాటు మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే ముకేశ్ అంబానీ గురించి మరో విషయం చాలా మందికి తెలేదు. అదే ముకేశ్ అంబానీ నీతా అంబానీ లవ్ స్టోరీ. అవును వీరి లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

When Mukesh Ambani met Nita: how did an arranged marriage transform into  true romance for India's richest power couple? | South China Morning Post

నీతా అంబానీ ఒక మంచి డాన్సర్. ఒక స్టేజ్ పై పర్ఫామెన్స్ చేస్తున్నప్పుడు ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ చూసి ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ముఖేష్ అంబానీకి మంచి జోడి అవుతుంది అని అలోచించి వారి తల్లితండ్రులను సంప్రదించారు. పెళ్లి సంబంధం కూడా మాట్లాడుకున్నారట. కానీ ముకేశ్ అంబానీ నీతా అంబానీ వెంటనే ఒప్పుకోలేదు. ముకేశ్ అంబానీ పెళ్ళికి ముందు కొన్ని రోజులు నీతా అంబానీతో కలిసి జర్నీ చేయాలని అనుకున్నారు. ఆ తరువాత ఒకరోజు ముఖేష్ అంబానీ తన లవ్ ని ప్రపోజ్ చేయాలనుకున్నారు. ఎక్కడ చేయాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదంటే. ఒకరోజు కారులో బయటికి తీసుకెళ్లి ప్రపోజ్ చేద్దాం అనుకున్నారు.

सदियों तक याद रखी जाएगी मुकेश अंबानी की लव स्टोरी, ट्रैफिक सिग्नल पर किया  था नीता को प्रपोज

కానీ కారులో వెళ్తుండగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అదే టైంలో ముఖేష్ అంబానీ నీతా అంబానీకి ప్రపోజ్ చేసారు. అయితే నీతా అంబానీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అక్కడ గ్రీన్ లైట్ పడిన ముఖేష్ అంబానీ మాత్రం కారు తీయలేదు. వెంటనే వెనుక వాహనాలు హారన్ కొట్టడం స్టార్ట్ చేసారు. ముఖేష్ అంబానీ మాత్రం నువ్వు సమాధానం చెబితేనే కారు ముందుకు టీతానని చెప్పడంతో నీతా అంబానీ కూడా తన ప్రేమని బయట పెట్టింది. నీతా అంబానీ లవ్ యు టూ అని చెప్పడంతో కారు ముందుకెళ్లింది. వారి ప్రేమ కూడా అలానే ముందుకెళ్లింది. ఆ తరువాత వీరిద్దరూ 1985 మార్చ్ 8న పెళ్లి పీటలెక్కారు. ఇలా వీరిద్దరి లవ్ స్టోరీ చాలా వెరైటీగా ఉంది.