ఎంతో ద్వేషించారు… నాగచైతన్యపై సమంత స్టైలీస్ట్ ప్రీతమ్ జుకల్కర్ సెన్సేషనల్ కామెంట్స్..

గతంలో సెలబ్రెటీ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ సమంతతో సాన్నిహిత్యంగా దిగిన ఫొటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోవడానికి ఇతడే కారణమని కూడా ప్రచారం సాగింది. ఈ ఫొటోను స్వయానా సమంతనే తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో షేర్ చేయడం చర్చినీయాంశంగా కూడా మారింది. చైతూ, సామ్ కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ఇతడిని ఫ్యాన్స్ కూడా బాగా ట్రోల్స్‌ చేశారు. అయితే దీనిపై అప్పట్లో ఈ కాస్ట్యూమ్ డిజైనర్ స్పందించలేదు. కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్‌పై అతడు మాట్లాడాడు.

Samantha's Closeness to Stylist/Designer Preetham Jukalkar Reason For  Divorce with Naga Chaitanya?

సమంత, తమ మధ్య ఒక అన్నాచెల్లెళ్ల బంధం లాంటిది తప్ప మరే ఇతర రిలేషన్ లేదని ప్రీతమ్ కుండ బద్దలు కొట్టాడు. సమంత తనలోని ప్రతిభను గుర్తించి ఎంతో ఎంకరేజ్ చేసిందని, ఆమె వల్లే తాను ముందడుగు వేయగలిగానని ఈ స్టైలిస్ట్ వెల్లడించాడు. ఆ విషయం తెలియని ఎంతోమంది తనను, సమంతను అన్యాయంగా విమర్శించారని చెబుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన కుటుంబాన్ని కూడా ఈ వ్యవహారంలో లాగి అవమానంగా కామెంట్స్ చేశారని వాపోయాడు.

Samantha Ruth Prabhu - Naga Chaitanya split: After Preetham Jukalker's  names crops in, the stylist disables comments on his social media

తన స్థానంలో తాను తప్ప వేరొకరు ఉండి ఉంటే ఇప్పటికే ఆత్మహత్య చేసుకుని ఉండేవారని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. సమంత ఫొటో పెట్టి డిలీట్ చేసిన తర్వాత తనని నెటిజన్లు ఎంతో ద్వేషించారని బాధను వ్యక్తం చేశాడు. నిజం తెలుసుకోకుండా తనని బాధపెట్టినట్టు ఎవరినీ బాధపెట్టవద్దని అతను కోరాడు. నాగచైతన్య గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. చైతన్య ఎంతో మంచివాడని, తాను కలిసిన మంచి వ్యక్తులలో చైతూ కూడా ఒకరని ప్రీతమ్‌ చెప్పుకొచ్చాడు.

Samantha With Designer In Caravan .. Akkineni Kodali Dressing Hot Topic!

ప్రీతమ్ ఇంకా మాట్లాడుతూ.. “ఫొటో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు ‘సమంత నీకు ఈ డిజైనర్ అవసరమా? పాత స్టైలిస్ట్ దగ్గరికి వెళ్తేనే బాగుంటుంది. ఈ ముంబై వాళ్లు చాలా డేంజర్. వారిని ఎందుకు నమ్ముతున్నావు’ అంటూ మాట్లాడారు. ఆ మాటలు ఎంతో బాధించాయి. ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా సొంత ప్రతిభతో నేను ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాను. చెడుగా ప్రవర్తించే అలవాటు నాకు లేదు. మంచి స్కిల్స్ నేర్చుకుని నేను ఇండస్ట్రీలో ఎదగడానికే అడుగు పెట్టాను.

Samantha Ruth | Naga Chaitanya: Chay-Sam split: News shocks Samantha's  father, reports claim actress refused Rs 200 cr alimony

ఇక నేను హీరోయిన్లకు మాత్రమే డిజైనర్‌గా పనిచేస్తాననే విమర్శ ఉంది. దాని వెనక ఒక మంచి ఉద్దేశ్యం ఉంది. అదేంటంటే హీరోయిన్లు మాత్రమే డిజైన్ విషయంలో ప్రయోగాలకు ఎక్కువగా ఒప్పుకుంటారు. హీరోలు అందుకు విరుద్ధం. అందుకే నా ప్రతిభను నిరూపించుకోవడానికి హీరోయిన్లు వద్ద మాత్రమే పనిచేస్తున్నాను” అని అన్నాడు.