తన నటనతో ఆకట్టుకున్న శ్రీ లీల ఆ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత సీనియర్ హీరో రవితేజకు జంటగా నటించిన ధమాకా సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా తర్వాత నుంచి తెలుగులో వరుస ఆఫర్లతో శ్రీ లీల దూసుకుపోతుంది.
ప్రస్తుతం ఈమె వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్ నుంచి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ వరకు టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలు అందరి సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. అలాగే నితిన్, వైష్ణవ తేజ్ వంటి యంగ్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇలా వరుస సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న శ్రీ లీల మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను ఫాలో అవుతోన్నట్టుగా ఉంది. రష్మిక కూడా బెంగళూరు నుంచి వచ్చి తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యింది.
ఇదే సమయంలో రష్మిక తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఇదే బాటలో శ్రీలీలా కూడా తెలుగులోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఓ కోలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయ్యింది.
ఆ సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా ఇక శ్రీలీల కోలీవుడ్‌లో పాగా వేసే ప్లాన్లో ఉంటుంది. అలాగే త్వరలోనే బాలీవుడ్ సినిమాల్లో కూడా ఈమె నటిస్తూ రష్మిక బాటలోనే నడిచే ప్రయత్నాల్లో ఉందట. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీ హీరోయిన్ గా మారింది శ్రీలీల. మరి ఈమె కోలీవుడ్, బాలీవుడ్ కలలు ఎంత వేరకు నెరవేరతాయో ? చూడాలి.