బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ వచ్చింది. అప్పటినుంచి తెలుగు సినిమాలకు భాషతో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమల వారు ఈ సినిమాలు కోసం ఎదురుచూస్తున్నారు. మన హీరోలు కూడా టాలీవుడ్‌కే పరిమితం కాకుండా ఏ భాషలో అవకాశం వచ్చిన అందులో నటించడానికి రెడీగా ఉన్నారు.
ఇక అలా ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటించే ఓ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ కూడా బయటకు వచ్చింది. రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్ లోనే కాకుండా గ్లోబల్ వైడ్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా దేవర చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ వచ్చే నవంబర్ లోపు కంప్లీట్ చేస్తారనే టాక్ ఉంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో వస్తున్న స్పై యూనివర్స్‌లో వార్2 మూవీ కూడా ఒకటి. ఈ సినిమా తొలి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించగా.. ఇప్పుడు సీక్వెల్ లో హృతిక్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.
ఈ సినిమాలో హృతిక్ రోషన్‌కు హీరోయాన్గా కియారా అద్వానీని ఎంపిక చేశారని అంటున్నారు. ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రానప్పటికీ ఇదే నిజమని తెలుస్తుంది. హృతిక్, ఎన్టీఆర్, కియారా లాంటి క్రేజ్ కాంబినేషన్‌తో వార్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కు జంటగా ఏ హీరోయిన్ నటిస్తుందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక కియారా ప్రస్తుతం రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుంది.
Al Nassr are advancing in talks to sign Hakim Ziyech from Chelsea, confirmed. Negotiations are underway — as called by Footmercato. 🚨🔵🇸🇦 #CFC #Saudi
Player open to discuss, proposal made.
Chelsea expect final bods from Saudi clubs for Ziyech and Aubameyang too. pic.twitter.com/9UBYtLGGgb
— Fabrizio Romano (@FabrizioRomano) June 17, 2023