చరణ్- ఉపాసనకు పుట్టబోయే బిడ్డకు ఊహించ‌ని గిఫ్ట్‌…. ఎవ‌రో పంపారో తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా మంచి పేరు తెచ్చుకున్న‌ ఈ జంటకు పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం వరుస‌ సినిమాలతో బిజీగా ఉన్నా తన భార్య కోసం కావాల్సినంత టైం స్పెండ్ చేస్తున్నాడు.

ఇప్పటికే పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన ఎంతో ఫర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటోంది. ఇక ఇప్పుడు తాజాగా రామ్ చరణ్- ఉపాసనలకు పుట్టబోయే బిడ్డ కోసం అప్పుడే కానుకలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉపాసనకు ఓ అరుదైన గిఫ్ట్ అందుకున్నారు. ఆ గిఫ్ట్ ఏంటి ? ఎవరు పంపారు అనేది ఇంట్ర‌స్టింగ్‌. రామ్ చరణ్- ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ అందమైన ఉయ్యాల బహుమతిగా వచ్చింది.

ఈ బహుమతిని పంపింది ప్రజ్వల ఫౌండేషన్. ఇక ప్రజ్వలా ఫౌండేషన్ చరణ్ – ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం ఈ అందమైన ఉయ్యాలను చేయించి గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వ్యభిచారంలో ఇరుక్కుని బయటపడిన మహిళలకు ప్రజ్వలా ఫౌండేషన్ ఉపాధితో పాటు ఆశ్రమం కూడా ఇస్తూ ఉంటుంది.

ఇక ఆ మహిళలు తయారు చేసిన ఉయ్యాలను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉపాసన సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేసింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది.. మీరు పంపిన ఈ అపూర్వ బహుమతి నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.. ఈ కానుకను అందుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉన్నట్టు ఉపాసన ఆ పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.