మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు హీరోయిన్గా ఎవరూ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఈ మెగా డాటార్ నిహారిక మాత్రం ఆ ధైర్యం చేసి యాంకర్ గా అడుగుపెట్టిన తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా చేసింది. ఇక అలాగే సినిమాల్లో నటిస్తున్న సమయంలో జొన్నలగడ్డ చైతన్యతో వివాహమైన తర్వాత నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పి వెబ్ సిరీస్లు నిర్మిస్తూ నిర్మాతగా మారింది.
ఇక రీసెంట్ గానే నిహారిక పింక్ ప్రొడక్షన్ హౌస్ అనే బ్యానర్ స్థాపించింది. గత రెండు నెలలుగా నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు నిజమనుకునేలా నిహారిక- చైతన్య ఇద్దరు సోషల్ మీడియాలో ఉన్న తమ ఫోటోలను డిలీట్ చేసుకుని ఎవరికి వారు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో నిహారిక అన్న వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో కూడా చైతన్య- నిహారిక కలిసి కనిపించింది లేదు. దీంతో వీరిద్దరీ విడాకుల వార్తలు కన్ఫామ్ అని అందరూ భావిస్తున్నారు.
తాజాగా నిహారిక తన భర్తను వదిలిపెట్టి మరో యంగ్ హీరోతో చనువుగా ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక మరి ఆ హీరో మరెవరో కాదు నిహారిక నిర్మించిన డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ హీరో అక్షయ్ లగుసాని. ఇప్పుడు వీరిద్దరి హాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్షయ్ షేర్ చేసిన ఆ వీడియోలో నిహారిక కాస్త ఎక్కువగానే గ్లామర్ ఒలకబోస్తోంది. ఆ వీడియోలో ఈ ఇద్దరు నా కొమ్ము నన్ను ఏం చేయదు.. కాసేపు నన్ను పడుకొనివ్వంటూ మాట్లాడుతున్న మాటలు చూసి నెటిజన్లు అందరూ షాక్ అవుతున్నారు.
చాలా రొమాంటిక్గా నిహారిక కవ్విస్తోంది. ఇప్పటికే ఒకవైపు విడాకుల వార్తలతో హాట్ టాపిక్ గా మారిన నిహారిక మరోవైపు ఇలాంటి రొమాంటిక్ వేషాలు ఏంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదిఏమైనా అసలు ఈ మెగా డాటర్ లైఫ్ లో ఏం ? జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.