ఇదెక్కడి ఆచారం రా బాబు.. వేరొక‌డి పెళ్లాన్ని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవాల్సిందే..!

మన భారతదేశంలో వివిధ కులాలు, మతాలు, ఆచారాలు సంస్కృతులు ఉన్నాయి. ఇన్ని వైవిధ్యాలు నెలకొన్నా వీటన్నిటిలో పెళ్లికి ఒకే స్థాయిలో ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఇండియన్స్ కొన్ని విషయాలలో వెస్ట్రన్ కల్చర్‌కి అలవాటు పడినా పెళ్లి బంధాన్ని మాత్రం ఇప్పటికీ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ నడుచుకుంటున్నారు. ఇది ఒక జన్మ జన్మల బంధంగా పరిగణిస్తూ పెద్దలు పెట్టిన కట్టుబాట్లను ఫాలో అవుతుంటారు.

 వివాహం.. అంటే రెండు మనుషులే కాదు ఇరు కుటుంబాల కలయిక. ముఖ్యంగా హిందు సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహం అనేది జన్మల జన్మల బంధం అని అంటారు. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అని అంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విచిత్రమైన వివాహ సంప్రదాయాలు ఉన్నాయి. వాటి గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెళ్లి అంటే ఒక జోక్ లాంటిది. వీరు వివాహ విషయంలో చిత్ర విచిత్రమైన ఆచారాలు పాటిస్తుంటారు. కొందరి వివాహ సంప్రదాయాలైతే నోరెళ్లబెట్టేలా చేస్తాయి. అలాంటి ఒక విడ్డూరమైన ఆచారాన్ని పశ్చిమ ఆఫ్రికాలో వోడబ్బే అనే తెగ అనుసరిస్తోంది. అదేంటంటే, ఈ గిరిజన వాసులు ఇతరుల భార్యలను దొంగలించి వారిని పెళ్లి చేసుకుంటారు.

 వోడబ్బే తెగ ప్రజల మొదటి వివాహం కుటుంబ సభ్యుల ఇష్టంతో జరుగుతుంది. రెండవ వివాహ సమయంలో మాత్రం వారు ఇతరుల భార్యలను దొంగిలించవలసి ఉంటుంది.

ఈ సంగతి తెలుసుకున్న వారందరూ ఇదెక్కడి దిక్కుమాలిన ఆచారం అని నోరెళ్లబెడుతుంటారు. ఇలాంటి చెడ్డ ఆచారాన్ని మానేయొచ్చు కదా అని ఇతరులు ఎవరైనా సలహా ఇస్తే అది కుదరదు అంటారు. ఎందుకంటే ఇతరుల భార్యలను దొంగలించే సంప్రదాయమే వీరి తెగకు అసలైన గుర్తింపు అట. నిజానికి వోడబ్బే తెగ ప్రజల మొదటి పెళ్లి కుటుంబ సభ్యుల ఇష్టంతోనే జరుగుతుంది.

 వారు ఇతరుల భార్యలను దొంగిలించకపోతే, వారికి తిరిగి వివాహం చేసుకునే హక్కు లేదు. కాబట్టి వారు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఇదే మార్గం.

ఒకవేళ రెండోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటే వారికి అనుమతి ఉండదు. అలాంటప్పుడు వారు ఇతరుల భార్యలను దొంగలించవచ్చు. అలా దొంగలించడం ఇక్కడ నేరం కాదు. అందుకే వారు రెండో పెళ్లి చేసుకోవడానికి ఇతరుల భార్యలను దొంగలించడమే మార్గంగా భావిస్తుంటారు. ఈ తెగ ప్రజలు ఏటా గారెవోలు అని పిలిచే ఒక స్థానిక పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో పిల్లలు దుస్తులు ధరించి ముఖాలకు రంగులు పూసుకుంటారు.

 ఈ ప్రజలు ప్రతి సంవత్సరం గారెవోలు అనే పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగ సందర్భంగా పిల్లలందరూ దుస్తులు ధరించి ముఖాలకు రంగులు వేసుకుంటారు. ఈ సమూహ కార్యక్రమంలో.. అబ్బాయిలు ఇతర మహిళల హృదయాలను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఇక మగవారు ఇతర మహిళల మనసులను దోచేయడానికి ప్రయత్నిస్తారు. ఈ పండుగ సందర్భంగా ఒకరి భార్య తన ఇష్టానుసారం వేరొకరితో పారిపోతే.. ఎవరూ అడ్డు చెప్పరు. చివరికి భర్త కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పరు. ఇలా మగవారు వేరొకరి భార్యని ఆకర్షించి తమతో పాటే లేపుకుపోతారు. ఇలా లేచిపోయిన జంటలకు సంఘ ప్రజలు రెండో పెళ్లి చేస్తారు. ఈ సమయంలో సంబంధించిన ప్రజలకు ఇష్టమో కాదో అడిగి తెలుసుకుంటారు.