మన చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. అలా వచ్చిన వారిలో ఎందరో హీరోలు ఉన్నారు. ఇప్పుడు మన మన స్టార్ హీరోలు టీచర్లుగా నటించిన సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం. ముందుగా నటరాత్మ ఎన్టీఆర్ నుంచి నేటి తరం హీరోలు ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఓ లుక్కేయండి.
ముందుగా నటరత్న ఎన్టీఆర్ బడిపంతులు సినిమాలో టీచర్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో శ్రీదేవి ఎన్టీఆర్ కు మనవరాలు పాత్రలో నటించింది. ఇక మరో అగ్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా టీచర్ పాత్రలో నటించి మెప్పించారు. అక్కినేని గురుబ్రహ్మ సినిమాలో మాస్టర్ గా నటించాడు. సూపర్ స్టార్ కృష్ణ కూడా బుర్రుపాలెం బుల్లోడు సినిమాలో ఈయన కూడా టీచర్ పాత్రలో నటించారు.
వీరి తర్వాత తరం హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కూడా ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించారు. ఈ నలుగురు అగ్ర హీరోలలో వెంకటేష్ సుందరకాండ సినిమాలో టీచర్ గా నటించి మెప్పించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఠాగూర్, మాస్టర్ సినిమాల్లో టీచర్ పాత్రలో నటించి అదరగొట్టారు. నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహా సినిమాలో టీచర్ పాత్రలో తన స్టైల్ మాస్ నటనతో అదరగొట్టారు.
అలాగే మాస్ మహారాజా రవితేజ కూడా మిరపకాయ సినిమాలో టీచర్ పాత్రలో నటించారు. మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం గీత గోవిందం సినిమాలో టీచర్ పాత్రలో నటించారు. ఇలా వీరే కాకుండా రీసెంట్ గా వచ్చిన సార్ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా టీచరుగా నటించి అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఈ హీరోలే లేకుండా ఎందరో హీరోలు టీచర్లుగా నటించి వెండితెరపై భారీ విజయాలు అందుకున్నారు.