నిత్యామీనన్ తో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆ స్టార్ హీరో ఎవరు..? ఇంత నీచంగా బీహేవ్ చేసాడా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ గా రికార్డుకి ఎక్కిన మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాని హీరోగా వచ్చిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. మరీ ముఖ్యంగా సహజంగా నటిస్తూ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకి సైతం ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది.

Nithya Menon : ఆ హీరో అసభ్యంగా ప్రవర్తించాడు : నిత్యామీనన్

ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ హీరోయిన్‌గా రాణిస్తుంది నిత్య మీనన్ అనుకున్న సమయంలోనే ఆమె ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేయడం లేదు. ఇదే సమయంలో రీసెంట్గా నిత్య మీనన్ కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. కోలీవుడ్లో సినిమాలు చేస్తున్నప్పుడు ఓ స్టార్ హీరో తనతో మిస్ బిహేవ్ చేశాడని.. నన్ను తాకరాని చోట తాకుతూ ఇబ్బంది గురి చేసాడని.. అప్పటినుంచి సినిమాలంటే నాకు విరక్తి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.

Nithya Menon| അയാളുടെ 30 നമ്പരുകൾ വരെ ബ്ലോക്ക് ചെയ്തു,എല്ലാവരും പറഞ്ഞു  പരാതി കൊടുക്കാൻ - glbnews.com

అంతేకాకుండా అప్పటినుంచి సినిమా షూటింగ్ కి వెళ్లాలన్న నాకు అసహ్యం వేసింది. అంటూ తనకు జరిగిన అవమానాన్ని గురించి ఓపెన్ అప్ అయ్యింది. ఏ పరిశ్రమలో అయినా మహిళలకు స్వేచ్ఛ ఇవ్వకపోతే ఎవరూ రాణించలేరు.. అంతేకాకుండా సమాజం ముందుకెళ్లదు అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో నిత్యామీనన్‌తో అంత అసభ్యంగా ప్రవర్తించిన హీరో ఎవరా..? అంటూ చర్చించుకుంటున్నారు . అంతేకాదు కొందరు ఆ హీరోని ట్యాగ్ చేసి పేరుతో సహా ట్రెండ్ చేస్తున్నారు..!!