భగవంత్‌ కేసరి: బాలయ్య కూతురుగా ఛాన్స్ వస్తే మిస్ చేసుకున్న ఆ దురదృష్టవంతురాలు ఎవరో తెలుసా..!

వరుస విజయాలతో దూసుకుపోతున్న నట‌సింహం బాలయ్య గ్లోబల్ లైన్ గా పాపులారిటీ తెచ్చుకుని ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. స్టార్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన‌ టీజర్, ఫస్ట్ లుక్ రీసెంట్ గానే బాలయ్య పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ సినిమా టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ బాలయ్యను ఎలా చూడాలి అనుకుంటున్నారో ఆ విధంగా మాస్ లుక్ లో అనిల్ రావిపూడి చూపించాడు.

Balakrishna's NBK 108 titled 'Bhagavanth Kesari, first look poster

అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇక మరో యంగ్ సెన్సేషన్ శ్రీ లీలా కూడా ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా నటిస్తోంది. ఇక నిన్న శ్రీలీలా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఆ పోస్ట‌ర్‌లో శ్రీ లీల ఎంతో ట్రెడిషనల్ గా.. చాలా పద్ధతిగా చాలా సింపుల్ లుక్ లో అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాకుండా శ్రీ లీల లుక్స్ ఆమె క్యారెక్టర్ ఈ సినిమాకే ఎంతో హైలెట్ గా ఉంటుందని అభిమానులు అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇలాంటి మంచి క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న మరో స్టార్ హీరోయిన్ ని దురదృష్టవంతురాలు అంటూ జనాలు ఏకీపారేస్తున్నారు. నిజానికి అనిల్ రావుపూడి ఈ సినిమాలో ఈ పాత్ర కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ కృతి శెట్టి ఆట. బాలయ్యకు కూతురుగా కృతి శెట్టి బాగా సెట్ అవుతుందని భావించారట. అయితే ఈ సినిమా స్టోరీ విన్నాక కృతి శెట్టి ఈ మూవీ ని రిజెక్ట్ చేసిందట. ఇక దాంతో సెకండ్ ఆప్షన్ గా అనుకున్న శ్రీ లీలను ఈ సినిమాకు సెలెక్ట్ చేశారు. ఇప్పటికే వరస విజయాలతో దూసుకుపోతున్న శ్రీలీలా మరో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉంది..!!

Krithi Shetty : బాలయ్యకి నో చెప్పిన బేబమ్మ..