తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకాలం దుమ్మారం రేపుతుంది. ఇక ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఈ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రజనీకాంత్ హీరోగా వచ్చిన కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కేపి చౌదరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి భారీ మొత్తంలో కోకైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఇక అంతేకాకుండా అతని దగ్గర ఉన్న నాలుగు సెల్ ఫోన్లతో పాటు లాప్టాప్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి టాలీవుడ్ కబాలి నిర్మాత కేపి చౌదరి తో పాటు పులువురు సినీ ప్రముఖులు కూడా ఆయనతో టచ్ లో ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన కేపి చౌదరి తో పాటు రోషన్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
అసలు విషయానికి వస్తే కేపీ చౌదరి రీసెంట్గా ఏర్పాటుచేసిన పార్టీలకు హాజరైన సినీ ప్రముఖుల లిస్టును పోలీసులు రెడీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే అతని నుంచి ఒక్కొక్కటిగా డ్రగ్స్ లింకులో బయటపడుతున్నాయి. ఇక అతను ఎవరెవరితో వాట్సాప్ లో చాటింగ్ చేశారో విశ్లేషిస్తున్నారు. డ్రగ్ మాఫియా పని అయిపోయింది అనుకుంటే గోవా టు హైదరాబాద్ రూట్ లో ఈ రాకెట్ మళ్ళీ తమ వ్యాపారాన్ని మొదలుపెట్టాయి.
ఇక మరోవైపు డ్రగ్స్ కింగ్ పిన్ గాబ్రియేల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. టాలీవుడ్ లో కేపీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి ఏమీ కాదు.. గతంలో హీరోయిన్ ఛార్మీ, రానా, పూరి,రవితేజ,నవదీప్,ముమైత్ ఖాన్,నందు,తరుణ్‌ను డ్రగ్స్ లింక్‌ల గురించి పోలీసులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు తాజాగా ఈ డ్రగ్స్ లింక్‌లో మరో ఇద్దరు స్టార్ హీరోయిన్లతో పాటు, నలుగురు క్యార్ట్ ఆర్టిస్ట్‌లు కూడా ఉన్నారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ డ్రగ్ మాఫియా వెనుక ఓ ప్రముఖ డైరెక్టర్ కూడా ఉన్నారని అంటూన్నరు. ఇక కేపీ చౌదరి ఫోన్‌ను పూర్తిగా పరిశీలించిన పోలిసులు.. ఆయనతో టచ్‌లో ఎవరెవరు ఉన్నారో? తర్వారలోనే వారి పేర్లు బయటపెడుతామని పోలీసులు తెలిపారు. ఇక ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ ఇష్యూ హట్ టాపిక్‌గా మారింది.