ఇండస్ట్రీలో లావణ్య త్రిపాఠి హాట్ టాపిక్ అయ్యింది. మరి కొన్ని రోజుల్లో మెగా కోడలు కానుంది. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరింగింది. అసలు వీరిద్దరూ ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఇంత సైలెంట్ గా మొత్తం జరగడంతో ఇండస్ట్రీలో అందరు షాక్ అయ్యారు. ఆ షాక్ లో ఉండగానే ఎంగేజ్ మెంట్ కూడా గ్రాండ్ గా జరిగిపోయింది.
ఇక మరి కొన్ని రోజుల్లో ఇటలీలో వీరి వివాహం జరగనుందని టాక్ నడుస్తుంది. ఎంగేజ్ మెంట్ తొందరగా అయిపోయిన్పటికీ వీరిద్దరి రింగులు, డ్రెస్సులు, అందరిని అట్రాక్ట్ చేసాయి. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి దుస్తులు నెట్టింట వైరల్ అయ్యాయి. మరి మెగా కోడలు అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అయితే తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. లావణ్య త్రిపాఠి పెళ్లి చీర ధర గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే లావణ్య త్రిపాటికి పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ పెళ్లి చీర దాదాపు 40 లక్షలకు పైగా ఖర్చు పెట్టి తయారు చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ ఈ ఖరీదైన చీరను రాజస్థాన్ లో చాలా స్పెషల్ గా డిజైన్ చేయిస్తున్నట్టు సమాచారం. అయితే చీర ఖరీదు 40 లక్షలు అని తెలియడంతో చాలామంది నెటిజన్స్ ఈ విషయం తెలిసి నోరెళ్ళబెడుతున్నారు. వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అని అందరు ఎదురుచూస్తున్నారు.