ప‌వ‌న్‌కు కొంటె చూపుల‌తో… బుంగ‌మూతితో లైన్ వేస్తోన్న శ్రీలీల…!

ఈ రోజు తెలుగు సోషల్ మీడియా స‌ర్కిల్స్‌లో ఎక్కడ చూసినా శ్రీలీలే హ‌వాయే కనిపిస్తోంది. ట్విట్టర్ లో ఆమె పేరు ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ ఇప్పుడు శ్రీలల చుట్టూ తిరుగుతోంది. ఆమె చేతిలో ఉన్న‌న్ని క్రేజీ ప్రాజెక్టులు మ‌రో హీరోయిన్ చేతిలో లేవు. ఇక ఈ రోజు ఆమె పుట్టినరోజు కావడంతో సోష‌ల్ మీడియాలో శ్రీలీల ఫ‌స్ట్ లుక్స్ రిలీజ్‌తో పాటు శ్రీలీల నామ‌స్మ‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ రోజు ఆమె నటిస్తున్న సినిమాల నుంచి వరుసపెట్టి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తూ ఆమెకు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు.

images.tv9telugu.com/wp-content/uploads/2023/06/sr...

ఈ రోజు ఏకంగా మ‌హేష్‌బాబు గుంటూరు కారం, రామ్ – బోయ‌పాటి సినిమా నుంచి అటు బాల‌య్య భగవంత్ కేసరి నుంచి కూడా శ్రీలీల పోస్టర్ వచ్చింది. అలాగే నితిన్-వక్కంతం సినిమా నుంచి శ్రీలల పాత్రను పరిచయం చేస్తూ, డేంజర్ పిల్ల అనే క్యాప్షన్ తగిలించారు. ఇక పంజావైష్ణ‌వ్ తేజ్‌ ఆదికేశవ సినిమా నుంచి ఎల్లో శారీలో ముద్దుగా కనిపించే లుక్ వ‌దిలారు.

Sreeleela: శ్రీలీల బర్త్ డే.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో విషెస్ చెప్పిన మేకర్స్

ఇక శ్రీలీల ఆహా కోసం బన్నీతో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తోంది శ్రీలీల. ఇందులో శ్రీలీల బ‌న్నీ చంక ఎక్కేసి మ‌రీ డ్యాన్స్‌కు రెడీ అవుతున్న‌ట్టు క‌వ్విస్తోంది. ఈ లుక్ వ‌దిలారు. ఇక అన్నింటిక‌న్నా హైలెట్‌గా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఆమె న‌టిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా శ్రీలీల ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో బుంగమూతి పెట్టి, చిరుకోపంతో చూస్తున్న లుక్ ను విడుదల చేశారు.

ఓ వైపు కొంటె చూపులు.. ఇటు బుంగ‌మూతితో ప‌వ‌న్‌ను క‌వ్విస్తోన్న‌ట్టుగా ఈ స్టిల్ ఉంది. అయితే ఈ పోస్ట‌ర్‌లో ప‌వ‌న్‌ను వెన‌క వైపు నుంచి చూపించారు. ప‌వ‌న్ త‌న‌దైన స్టైల్లో శ్రీలీల వైపు చూస్తుండ‌గా.. ఆమె ప‌వ‌న్‌ను చూస్తూ క‌వ్విస్తోన్న‌ట్టుగా ఉంది. మొత్తానికి శ్రీలీల నుంచి ఈ రోజు రిలీజ్ అయిన అన్ని ఫ‌స్ట్ లుక్‌ల‌తో సోష‌ల్ మీడియా మార్మోగుతోంది.