మ‌హేష్‌బాబును దారుణంగా దెబ్బ‌కొట్టిన బ‌న్నీ… ఇంత పెద్ద షాక్ ఇస్తాడ‌నుకోలేదే..!

ఎస్ ఇప్పుడు టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో ఇదే మాట వినిపిస్తోంది. మ‌హేష్‌బాబు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఏఎంబీ మాల్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ మాల్స్‌, థియేట‌ర్ల మార్కెట్‌లో తిరుగులేదు. ఇందులో ఉన్న 7 స్క్రీన్ల‌తో పాటు ఇంటీరియ‌ర్ డిజైనింగ్ అదిరిపోయేలా ఉంది. దీంతో చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల ఫంక్ష‌న్లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ల ఫంక్ష‌న్లు కూడా ఇందులోనే నిర్వ‌హిస్తున్నారు.

Allu Arjun New Theatre AAA Cinemas In Hyderabad Inauguration On June 15 To  Open With Prabhas Adipurush | Allu Arjun AAA Cinemas: అల్లు అర్జున్  మల్టీఫ్లెక్స్ 'AAA సినిమాస్'లోని ఈ ప్రత్యేకతలు మీకు ...

అయితే ఇప్పుడు అమీర్‌పేట లాంటి ప్రైమ్ ఏరియా.. అందులోనూ హైద‌రాబాద్‌కు గుండెకాయ లాంటి ఏరియాలో పాత స‌త్యం థియేట‌ర్ ప్లేస్‌లో బ‌న్నీ ఏఏఏ మాల్ నిర్మించారు. ఈ ఏసియ‌న్ ఏఏఏ మాల్ ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమాతో ఓపెన్ అవుతోంది. ఇందులో ఐదు స్క్రీన్లు ఉన్నాయి. ఈ మ‌ల్టీఫ్లెక్స్ ఓపెనింగ్‌తో ఎవ‌రికి ఎఫెక్ట్ ప‌డ‌బోతోంద‌న్న చ‌ర్చ‌లు కూడా హైద‌రాబాద్ సినిమా వ‌ర్గాల్లోనూ, నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ వ‌ర్గాల్లోనూ… న‌డుస్తోంది.

Analysis: Can AAA Cinemas Disrupt The Market?

ఏఎంబీ మాల్ హైద‌రాబాద్ సిటీకి ఓ ఐకానిక్ థియేట‌ర్‌గా మారింది. సెల‌బ్రిటీలు ఎవ‌రు సినిమా చూడాల‌న్నా ఇప్పుడు ఈ థియేట‌ర్‌కే వెళుతున్నారు. ఏఎంబీఎఫెక్ట్‌తో అప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌కే తల‌మానికంగా ఉన్న ప్ర‌సాద్ మ‌ల్టీఫ్లెక్స్ హ‌వా త‌గ్గుతూ వ‌చ్చింది. ప్ర‌సాద్‌లో మాస్ హ‌డావిడి ఉంటుంది. అందుకే అక్క‌డ సెల‌బ్రిటీలు రావ‌డం మానేస్తున్నారు.

ప్ర‌సాద్ మ‌ల్టీఫ్లెక్స్‌ను ఎంత రెన్నోవేట్ చేసినా ఏఎంబీ పోటీని త‌ట్టుకోలేక దాని ప్ర‌భ మ‌స‌కబారుతూ వ‌స్తోంది. ఇప్పుడు హైద‌రాబాద్‌కు ప్రైమ్ ఏరియా అయినా అమీర్‌పేట‌లో బ‌న్నీ మాల్ రావ‌డంతో ఈ మాల్ ఫస్ట్ ఎఫెక్ట్ ప్రసాద్స్ మీదే పడుతుందంటున్నారు. సెకండ్ ఎఫెక్ట్ ఎఎంబి మీద కూడా పడుతుంది. సినిమా కార్యక్రమాలు అన్నీ ఇకపై ఎఎంబి క‌న్నా సెంట‌ర్ పాయింట్‌లో ఉన్న ఏఏఏ లోనే జ‌రిగే ఛాన్స్‌లు ఉన్నాయంటున్నారు.

Mahesh Babu's High end Multiplex in Hyderabad | Friday Poster - YouTube

ఏదేమైనా అటు ప్ర‌సాద్స్‌కు, ఇటు ఏఎంబీకి మ‌ధ్య‌లో ఉన్న ఏఏఏ మాల్ ఇక‌పై ఈ రెండు మల్టీఫ్లెక్స్‌ల‌కు గ‌ట్టి పోటీ అయితే ఇవ్వ‌నుంది. అయితే ఎటొచ్చి అమీర్‌పేట ఏరియాలో ఉండ‌డంతో ఖ‌చ్చితంగా దీనివ‌ల్ల ట్రాఫిక్ ఇబ్బందులు త‌ప్ప‌వంటున్నారు.