గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ప్రచారం జరుగుతోన్న గాసిప్‌లలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం. ఇక ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. జూన్ 9న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకు మెగా ప్యామిలి మొత్తం హాజరయ్యారు. దీంతో లావణ్య త్రిపాఠి గురించి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈమెకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు ఈమె తల్లి ఎవరు ? తండ్రి ఎవరనే విషయాలపై గూగుల్లో ఒక్కసారిగా వెతకడం మొదలుపెట్టారు నెటిజెన్లు. అలా ఈమె గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం కారణంగా ఈ ముద్దుగుమ్మ గురించి చాలా విషయాలు బయటకు వచ్చాయి. లావణ్య త్రిపాఠి తండ్రి హైకోర్టు మరియు సివిల్ కోర్టులో లాయరుగా పనిచేసేవారు. ఆమె అమ్మ కూడా టీచర్‌గా పనిచేసి రిటైరయ్యారు.
వీరి ఫ్యామిలీలో అందరికంటే చిన్నది లావణ్య త్రిపాఠి, ఈమెకు ఒక అన్నయ్య, అక్క కూడా ఉన్నారు. లావణ్య త్రిపాఠి అన్నయ్యని చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. టాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమాత్రం అతడు తీసిపోడన్నట్టుగా ఉంటాడు. అంతేకాకుండా కొందరు యంగ్ హీరోలు కూడా ఇతని కటౌట్ ముందు దిగదుడుపే అన్న రేంజ్‌లో ఉంటాడు. రీసెంట్‌గా జరిగిన లావణ్య ఎంగేజ్మెంట్ వేడుకకు లావణ్య అన్నయ్య కూడా వచ్చాడు.
మనోడి కటౌట్, గ్లామర్ ముందు అక్కడికి వచ్చిన మెగా ఫ్యామిలీ హీరోలు కూడా డామినేట్ అయ్యారన్న చర్చలు సోషల్ మీడియాలో వినిపించాయి. అంత అందం పెట్టుకొని కూడా ఆయన సినిమాల్లోకి రాకపోవడానికి ఆయనకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేదట. ప్రస్తుతం ఓ MNC కంపెనీ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న లావణ్య త్రిపాఠి అన్నయ్య.. నెలకి లక్షల్లో జీతం సంపాదిస్తున్నాడు ఇప్పుడు ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.