టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీ రెడ్డి గురించి చెప్పుకుంటే చాంతాడంత స్టోరీ ఉంటుంది. అసలు గత నాలుగేళ్లుగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు కుప్పలు తెప్పలుగా వీడియోలు, వార్తలు దర్శనమిస్తూనే ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ పోస్టు పెట్టడమో లేదా ఎవరిపైనో ఏదో ఒక విమర్శ చేస్తూ వార్తల్లో ఉంటోంది శ్రీరెడ్డి. ఇటీవల శ్రీరెడ్డి వంటలక్కగా అవతారం ఎత్తింది.
చేపల పులుసు, చికెన కూర వండుకుంటూ యూట్యూబులో వీడియోలు పెడుతూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఎప్పటికప్పుడు టార్గెట్ చేసే శ్రీరెడ్డి తాజాగా మరోసారి పవన్‌పై రెచ్చిపోయింది. బూతులతో తీవ్రంగా విరుచుకుపడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్… ఏపీలో జనసేన పార్టీ ఆఫీస్ కోసం శంకుస్థాపన చేశారు.
ఈ క్రమంలోనే పవన్ కొత్త గెటప్‌లో కనిపించడంతో పాటు భూమి పూజ కూడా చేశారు. ఈ ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలపై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయారు. గుంటల కోసం గుండె పూజ చేస్తోన్న పావలా బావ అంటూ పోస్టు పెట్టింది శ్రీరెడ్డి. జనసేన కార్యాలయం ప్రారంభోత్సవానికి పవన్ పాల్గొన్న ఫొటోలు కూడా షేర్ చేసింది శ్రీరెడ్డి.
అలాగే రీసెంట్గా వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ సింగిల్ గా హాజరు కావడంపై కూడా సెటైరికల్‌గా రిప్లే ఇచ్చింది శ్రీరెడ్డి. నలుగురు భార్యలు ఉన్న… నా దేవుడు ఒంటరి వాడే అంటూ మొన్న విమర్శించింది. ఇక ఇప్పుడు గుంటల పూజా అంటూ సెటైర్ వేసింది శ్రీరెడ్డి. ఏదేమైనా పవన్‌ను శ్రీరెడ్డి బూతులు తిడుతూ ఉండడంతో పవన్ ఫ్యాన్స్ కూడా నువ్వు మహాప్రతివ్రతవి అంటూ రెచ్చిపోతున్నారు.