తెలుగు చిత్ర సినిమాలో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్‌కి ఉందనడంలో సందేహం లేదు. ఈ పవర్ స్టార్ తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో, మంచి వ్యక్తిత్వంతో సామాన్యుల అభిమానాన్నే కాకుండా సెలబ్రిటీల అభిమానాన్ని కూడా చూరగొన్నాడు. అయితే పెళ్లి విషయంలో మాత్రం పవన్ పూర్తిగా విఫలమయ్యాడు. అతని మొదటి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగా మారితే, రెండో పెళ్లి కూడా విడాకులతో ముగిసింది. పవన్ రేణు దేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఈ చూడ ముచ్చటైన జంట 2019లో పెళ్లి చేసుకుని 2012లో విడాకులు తీసుకుంది. అయితే విడాకులు అసలు ఎందుకు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ అంత చెడ్డోడా అనే కోణంలో ఇప్పటికీ చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ మంచితనమే వారి విడాకులకు కారణమయ్యిందని నెట్టింట ప్రచారం మొదలైంది. ముఖ్యంగా నాగబాబు వల్లే పవన్, రేణు దేశాయ్ పచ్చని కాపురంలో చిచ్చురేగిందని ప్రచారం జరుగుతోంది.
రామ్ చరణ్ హీరోగా నాగబాబు 2010లో ఆరంజ్ మూవీ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో తీసిన ఈ సినిమా ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమా ఫెయిల్యూర్‌తో నాగబాబు ఒక్కసారిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఆ ఆర్థిక ఇబ్బందులు తాగలేక చివరికి ఆత్మహత్యకు కూడా సిద్ధమయ్యాడు. పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు అలాంటి పరిస్థితి రావడానికి చూసి అసలు తట్టుకోలేకపోయాడు.
అందుకే తన ఫ్యామిలీ గురించి ఏమాత్రం ఆలోచించకుండా తనకు సాధ్యమైనంత డబ్బులను నాగబాబుకి ఇచ్చి ఆదుకున్నాడు. అయితే ప్రచారం ప్రకారం, ఈ సంగతి తెలిసి రేణు దేశాయ్ పవన్‌తో పెద్ద గొడవ పెట్టుకుందట. సంపాదించిన డబ్బంతా మీ అన్నయ్యకి ఇచ్చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆమె పవన్‌తో వాగ్వాదానికి దిగిందట.
ఇక ఈ విషయంలో రోజు గొడవే జరుగుతుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఆమె నుంచి విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాడట. ఆ విధంగా వారి విడిపోయారని టాక్ నడుస్తోంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తన అన్నను ఆదుకునేందుకు ఫ్యామిలీ కంటే అన్నదమ్ముల బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అన్నదమ్ముల బంధానికి పవన్ ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో అర్థమవుతోంది.