మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమా నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు. రామ్ చరణ్ సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు కానీ నటుడిగా చరణ్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. చిరంజీవి, చరణ్ కాంబోలో ఒక హిట్ సినిమా వస్తే బాగుంటుందని ఈ కాంబోను తెరపై చూడాలంటే రెండు కళ్లు చాలవని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.
మరోవైపు ఇతరులను గౌరవించే విషయంలో రామ్ చరణ్ కు ఎవరూ సాటిరారనే సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోని అందరు హీరోలతో రామ్ చరణ్ స్నేహంగా మెలుగుతారు. ఎక్కువగా మాట్లాడటం కంటే తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడంపై ఈ హీరో ప్రధానంగా దృష్టి పెడతారు. అయితే వేణుస్వామి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఉపాసన వచ్చిన తర్వాతే చరణ్ కు బాగా కలిసొచ్చిందని చెప్పుకొచ్చారు.
చరణ్ ఈ రేంజ్ లో సక్సెస్ కావడానికి ఉపాసన కారణం అనేలా ఆయన కామెంట్లు చేశారు. ఉపాసన కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం చరణ్ ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యేవారు కాదని ఆయన చెప్పకనే చెప్పేశారు. ఉపాసన – చరణ్ జాతకాలు అద్భుతంగా కలవడమే ఈ జోడీకి ప్లస్ అయిందని సమాచారం. ఉపాసన చరణ్ జీవితంలోకి రాకపోతే చరణ్ జీవితం ఘోరంగా ఉండేదట. పెళ్లి తర్వాత అన్యోన్యంగా ఉంటూ ఈ జోడీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుండగా చరణ్ ఆమెను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నారని సమాచారం. సినిమాలపై ఉపాసనకు అవగాహన ఉన్నా చరణ్ సినిమాలకు సంబంధించి ఉపాసన అస్సలు జోక్యం చేసుకోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఉపాసన చాలా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తారని ఆమె చేసుకున్న పుణ్యం వల్లే చరణ్ కు కెరీర్ పరంగా మంచి జరుగుతోందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.