ఎన్టీఆర్ ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్‌నే కాల‌ద‌న్నుకున్న ఆలీ… రెండు సార్లు మిస్‌…!

అలీ… ఈ పేరు త‌లుచుకుంటేనే తెలుగు లోగిళ్ల‌లో న‌వ్వులు విర‌బూస్తాయి. అలాంటి హాస్య న‌టుడు. అయితే. ఈయ‌న కూడా పెద్ద‌గాచ‌దువు కోలేదు. దీనికి కార‌ణం.. చెన్నైలో అలీ నాన్న టైల‌ర్‌గా చేసేవారు. సినిమా హీరోల‌కు దుస్తులు కుట్టేవారు. ఓ సందర్భంలో త‌మిళ‌న‌టుడు పేరు తెలియ‌దు కానీ.. టైల‌ర్ షాపుకు వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో అలీ.. దుస్తుల‌కు కాజాలు వేస్తున్నారు.

Sr NTR To Hit Screens Again | Movie News

బాలుడు బాగున్నాడే.. ఎవ‌రు మీ అబ్బాయా? అని ప్ర‌శ్నించారు. ఈ స‌మ‌యంలోనే బాల‌చంద‌ర్ తీస్తున్న సీతాకోక చిలుక సినిమా ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చి.. అందులో న‌టించేందుకు ప‌ది మందికిపైగా పిల్ల‌ల‌ను తీసుకుంటున్నార‌ని.. నేను చెబుతాను.. నువ్వు పంపిస్తావా? అని అడిగార‌ట‌. దీనికి అలీ నాన్న ఒప్పుకోలేదు. మావోడు బాగా చ‌దివి ఉద్యోగం చేయాల‌ని ఆశిస్తున్నాను. సినిమా ప్ర‌పంచంలో నిల‌క‌డ ఉండ‌దు. డ‌బ్బులు కూడా రావ‌న్నార‌ట‌.

దీంతో ఆయ‌న వెళ్లిపోయారు. అయితే.. త‌ర్వాత‌.. బాల‌చంద‌ర్ అసిస్టెంట్ నేరుగా టీన‌గర్‌లో ఉన్న అలీ తండ్రిగారి షాపుకు వ‌చ్చి.. బాల‌చంద‌ర్‌గారు మిమ్మ‌ల్ని ర‌మ్మ‌న్నారు అని కారులో ఎక్కించుకుని వెళ్లారు. క‌ట్ చేస్తే.. అలీ సీతాకోక చిలుక సినిమాలో బాల న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఇలాప్ర‌స్థానం ప్రారం భించిన అలీకి.. అన్న‌గారు ఎన్టీఆర్‌తోనూ ప‌రిచ‌యం అయింది.

Comedian Ali hurt, gives fitting reply to Pawan Kalyan

ఆయ‌న తీసిన పోతులూరివీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి సినిమాలో బాల వీర బ్ర‌హ్మంగా న‌టించే ఆఫ‌ర్ ఇచ్చారు. దీనికి అలీ తండ్రిగారు కూడా ఒప్పుకొన్నారు. కానీ, సినిమాకు అన్నీ ఓకే చేసుకున్నాక‌.. హ‌ఠాత్తుగా అలీ తండ్రికి అనారోగ్యం చేసి.. క‌న్నుమూశారు. ఇక‌, ఈ సినిమాలో వేరేవారిని పెట్టుకున్నారు. ఇలా అన్న‌గారు ఇచ్చిన ఆఫ‌ర్ త‌న‌కు మిస్స‌యింద‌న‌ని అలీ అనేక సంద‌ర్భాల్లో చెప్పారు.