నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను తన ఖాతాలో వేసుకుని ప్రస్తుతం తన 108వ నిమాను స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే పవర్ ఫుల్ టైటిల్ కూడా పెట్టారు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా. మరో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో బాలయ్యకు ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు.ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సినిమాను నిర్మిస్తున్నారు.
మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయింది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. బాలయ్య పుట్టినరోజు కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన టీజర్ కి కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ విషయం అలా ఉంచితే ఈ సినిమా విడుదలకు నాలుగు నెలల ముందే భగవంత్ కేసరి ఓటీటీ డిల్ క్లోజ్ అయిపోయింది.
ఎవరు ఊహించని రేటుకు ఈ సినిమా డిజిటల్ హక్కులు కొనుగోలు చేశారు. బ్యాక్ టు బ్యాక్ విజయాల తర్వాత బాలయ్చ నుంచి వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకోవడానికి ప్రముఖ ఓటీటీ సంస్థలు గట్టిగానే పోటీ పడ్డాయట. చివరికి అమెజాన్ ప్రైమ్ రూ.20 కోట్లకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఇది నిజమైతే బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ ఓటీటీ డీల్‌గా నిలిచిపోనుంది.