చిరంజీవి కొత్త సినిమా టైటిల్ వ‌చ్చేసింది.. చిరు బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్ స్టైల్లోనే ఉందిగా…!

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల క్ర‌మంలోనే ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. అంత‌కు ముందు చిరు చేసిన ఆచార్య‌, గాడ్‌ఫాద‌ర్ రెండు సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే బాబి ద‌ర్శ‌క‌త్వంలో చేసిన వాల్తేరు వీర‌య్య అంచ‌నాల‌కు మించి మ‌రీ విజ‌యం సాధించింది. ఇంకా చెప్పాలంటే చిరు అభిమానుల్లో స‌రికొత్త ఉత్సాహం నింపింది.

Jagadeka Veerudu Athiloka Sundari (1990) - IMDb

ప్ర‌స్తుతం చిరంజీవి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళాశంక‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఆగ‌స్టు 11న ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. కోలీవుడ్‌లో అజిత్ హీరోగా వ‌చ్చిన వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండగా… కీర్తిసురేష్ చిరుకు చెల్లిగా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే చిరు త‌ర్వాత సినిమాల లైన‌ప్‌పై కూడా క్ర‌మంగా క్లారిటీ వ‌స్తోంది.

క‌ళ్యాణ్‌రామ్‌తో బింబిసార లాంటి సూప‌ర్ హిట్ తెర‌కెక్కించిన మ‌ల్లిడి వ‌శిష్ట్ ఇప్పుడు చిరుకోసం అదిరిపోయే సోషియో ఫాంట‌సీ లైన్ రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా స్టోరీ కూడా చిరు న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమా స్టైల్లో ఉండ‌బోతోంద‌ని టాక్ ? అయితే జ‌గ‌దేక‌వీరుడు సినిమాలో హీరోయిన్‌ శ్రీదేవి దేవకన్యలా భూమి మీదకు వచ్చి సామాన్యుడైన చిరంజీవివీ ప్రేమిస్తుంది.

Jagadeka Veerudu Athiloka Sundari - Telugu Movie Review, Ott, Release Date,  Trailer, Budget, Box Office & News - FilmiBeat

ఈ సినిమాలో ముల్లోకాల నుంచి భామ‌లు హీరోకోసం కింద‌కు వ‌స్తార‌ట‌. ఈ సినిమాలో ఏకంగా 8 మంది హీరోయిన్లు క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. ఆ హీరోయిన్లు ఎవ‌రు ? అన్న‌ది ప్ర‌స్తుతానికి ఫైన‌లైజ్ కాక‌పోయినా న‌లుగురైదుగురు స్టార్ హీరోయిన్లు ఉంటార‌ని స‌మాచారం. ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా కూడా టాక్ ? ఇది వ‌ర్కింగ్ టైటిల్ అంటున్నా ఇదే ఫైన‌ల్ అవుతుంద‌ని కూడా అంటున్నారు.