దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. బాలనటిగా చిత్ర పరిశ్రమలలో కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి.. అలా చిత్ర పరిశ్రమలో ఉన్న చాలామంది అగ్ర హీరోలతో కలిసి నటించింది. ఇదే క్రమంలో తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరైన నట సింహం బాలకృష్ణ కూడా బాల నటుడు గానే తన కెరీర్ను ప్రారంభించాడు. బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో కలిసి నటించిన.. ఒక్క శ్రీదేవితో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు.
1978 కే రాఘవేందర్రావు దర్శకత్వంలో పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. బాలకృష్ణ కూడా 1974 నుంచి బాల నటుడిగా కెరీయర్ ను ప్రారంభించారు. తాతమ్మ కాల సినిమాతో బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మంగమ్మగారి మనవడు, భలే దొంగ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.
ఇక తెలుగులో బాలకృష్ణతో పాటు స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో కూడా శ్రీదేవి నటించిన అలరించింది. అదే సమయంలో బాలయ్యతో మాత్రం సినిమా చేయలేదు. దానికి పెద్ద కారణమే ఉందట.. అసలు విషయం ఏమిటంటే రాఘవేంద్రరావు 1987లో బాలకృష్ణ శ్రీదేవి కాంబోలో ఓ సినిమా చేయాలని భావించారు.. అదేవిధంగా ఆ సినిమాని కూడా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఆ సినిమాకు సామ్రాట్ అనే పేరును కూడా అనౌన్స్ చేశారు.
ఇదిలా ఉంటే.. 1989లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భలేదొంగ తీసుకురావాలనుకున్నారు. కానీ అందులో శ్రీదేవిని హీరోయిన్ గా అనుకున్నారు. ఆదే సమయంలో శ్రీదేవి ఫుల్ బిజీగా ఉండటంతో ఆ సినిమాలో నటిచడం కుదరలేదు.ఇక దీంతో బాలయ్యతో నటించే ఆవకాశం శ్రీదేవికి ఇక రాలేదు. కానీ కొంటె కృష్ణుడు, రౌడి రాముడు, అనురాగ దేవత వంటి సినిమాలో బాలయ్ శ్రీదేవి కలిసి నటించారు. ఇక అదే సమయంలో బాలకృష్ణ, శ్రీదేవి కలిసి జంటగా ఏ సినిమాలో నటించలేదు.