టాలీవుడ్‌లో స్టార్ హీరోల మధ్య వార్ నిత్యం నడుస్తూనే ఉంటుంది. తమ అభిమాన హీరో ఎక్కువంటే.. తమ హీరోనే టాప్ అంటూ ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల ఫ్యాన్స్ మధ్య వార్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒకరి రికార్డును మరో హీరో బద్దలుకొట్టాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. అయితే వీరిద్దరిలో బెటర్ ఎవరనే విషయంపై ఇప్పటివరకు ఎవరూ కామెంట్ చేసి వివాదాన్ని క్రియేట్ చేయలేదు.
తాజాగా ఓ బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ మాత్రం పవన్ కల్యాణ్ కంటే కూడా మహేష్ బాబు బెటర్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దీంతో నెట్టింట సదరు యాక్టర్‌ను పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఏసుకుంటున్నారు. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు.. పవన్ కంటే మహేష్ ఏ విషయంలో బెటర్ అనే వివరాలు ఏమిటో ఇక్కడ చూద్దాం. ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయి తనదైన యాక్టింగ్‌తో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు.
అయితే ఆయన నటించిన తాజా వెబ్ సిరీస్ ‘సిర్ఫ్ ఏక్ బందా హై’ను తెలుగులోనూ డబ్ చేసి స్రీమింగ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సిరీస్‌లో తాను చేసిన లాయర్ పాత్రను తెలుగులో అయితే పవన్ కల్యాణ్ కంటే కూడా మహేష్ బాబు అయితే బెటర్‌గా చేస్తాడని మనోజ్ బాజ్‌పాయి కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.