ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి మొదటి సినిమాతోనే తన నటన అభినయంతో ప్రేక్షకులను మెప్పించ్చింది. తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాలను అందుకుంది. ఇదే సమయంలో కృతి శెట్టి బంగార్రాజు సినిమా తర్వాత నుంచి తన కెరీర్లో సరైన హిట్ పడలేదు.
ఎన్ని సినిమాలు చేసిన బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి. ఇక తాజాగా నాగచైతన్యతో కలిసి నటించిన కస్టడీ సినిమాపై కృతి శెట్టి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సమయంలోనే కృతి శెట్టి సినిమాల్లోకి రాకముందు కూడా డబ్బులు సంపాదించేదట . అది ఎలాగో మీకు తెలుసా..సోషల్ మీడియాలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ ద్వారా కృతి శెట్టి చదువుకునే రోజుల్లో డబ్బులు సంపాదించేదట.
ఇక ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు వచ్చాక కృతి శెట్టి అడ్వర్టైజ్మెంట్లో నటించడం మానేసిందట. స్టార్ హీరోయిన్‌గా మారాక యాడ్ లల్లో నటించడం ఏంటి ..? అంటూ తన వద్దకు వచ్చిన ఓ భారీ ఆఫర్ ను సైతం రిజెక్ట్ చేసిందట. అందుకే తనకు ఒకప్పుడు లైఫ్ ఇచ్చిన యాడ్స్ ని ఇప్పుడు ఆమె వదిలేసుకుందని..అందుకే ఆమె కెరీర్ ఇలా తగలాడింది అంటూ కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక దీంతో మరోసారి సోషల్ మీడియాలో కృతి శెట్టి పేరు వైరల్ గా మారింది..!!