“ఎస్..ఐ యామ్ ఇన్ లవ్”..విజయ వర్మతో ప్రేమపై తొలిసారిగా నోరు విప్పిన తమన్నా..!!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. తన అందం, అభిన‌యంతో త‌న సినిమాల‌తో టాలీవుడ్ ని ఓ రేంజ్‎లో షేక్ చేసేసింది.తెలుగులో తమన్నా నటించి చాలా రోజులే అయినప్పటికీ యూవ‌త‌ గుండెల్లో ఇప్పటికీ గ్లామ‌ర్ బ్యూటిగా నిలిచిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‎లో వ‌రుస సినిమాలు వెబ్‎సిరీస్‎లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా తమన్నా తెలుగులో చిరంజీవికి జంట‌గా భోళా శంకర్ సినిమాలో న‌టిస్తుంది. ఇక త్వరలో ఈ సినిమా తెరముందు సందడి చేసేందుకు సిద్ధమైంది.

Fans spot Tamannaah kissing Vijay Varma. 5 times actress made headlines for  rumoured linkups - India Today

ఈ విష‌యం పక్కన పెడితే గత కొంత కాలంగా బాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ వర్మతో డేటింగ్ రూమర్స్‎తో తమన్నా సోష‌ల్ మీడియాలో హ‌ట్ టాపిక్‌గా మారింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ వార్త‌లు నిజమేనని, ఎస్ ఎస్ ఐ యామ్ ఇన్ లవ్ అని మిల్కీ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది . విజయ్ వర్మతో ల‌వ్‌లో ఉన్నానని చెప్క‌నే చేసింది తమన్నా. బాలీవుడ్ హీరో విజయ్ వర్మ, తమన్నా క‌లిసి న‌టించిన‌ ‘లస్ట్ స్టోరీస్ 2’ ఈ వెబ్ సిరీస్ షూటింగ్‎లోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందట. ఇదే విషయాన్ని స్వయంగా తమన్న చెప్పుకొచ్చింది. వీరిద్ద‌రూ కలిసి తొలిసారిగా నటిస్తున్న ఈ తొలి ప్రాజెక్టు లోనే వారి ప్రేమకు బేజం పడిందని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ.

ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో తమన్నా తన ప్రేమ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. తాజాగా జ‌రిగిన‌ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. నాకు పార్ట‌న‌ర్‌ అయినందుకు నేను విజయవర్మను ఇష్టపడలేదు. నేనే చాలామంది నటులతో కలిసి నటించాను కానీ, విజయ వర్మ మాత్రం వాళ్ళ అందరికంటే నాకు చాలా స్పెషల్. నాకు ఏమైనా జరిగితే నాకు అతను రక్షణగా నిలబడతాడనే నమ్మకం నాకు ఉంది.

Wondering how Vijay Varma lovingly calls rumoured girlfriend Tamannaah  Bhatia? Find out - India Today

మా ఇద్దరి మధ్య చాలా మంచి రిలేషన్ కూడా ఉంది. నా కెరీర్లో అయినా వేరే విషయంలో అయినా నన్ను కిందకు లాగాలనుకునే వారి నుంచి నన్ను కాపాడుతాడు. నేను నాకంటూ అందమైన ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. అనుకోకుండా నా ప్రపంచంలోకి నన్ను నన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి వచ్చాడు. ఇక నన్ను విజయ్ ఎంతో బాగా చూసుకుంటాడు. అతను ఎక్కడ ఉంటే అదే నా ప్రపంచం”. అని తమన్నా తన లవ్ స్టోరీని రివీల్ చేసింది. దీంతో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే టాక్‌ ఇండస్ట్రీలో జోరందుకున్నాయి.