సరద సరదాగా ఉండే శోభ‌న్‌బాబు..సినిమాల్లో వరుసల విషయంలో అంత కఠినంగా ఉంటారా..?

తెలుగువారి సోగ్గాడు.. శోభ‌న్‌బాబు. ఆయ‌న న‌టించిన సినిమాలు.. కుటుంబ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందా యి. ముఖ్యంగా మ‌హిళా లోకం ఆయ‌న సినిమాల కోసం వేచి చూసిన ప‌రిస్థితి కూడా ఉంది. అయితే… ఆయ‌న కొన్ని క్ర‌మ‌శిక్ష‌ణ‌లు పాటించేవారు. నేను అంద‌రిలా ఉండ‌ను. నేను నాలాగే ఉంటా! అని మొహం మీదే చెప్పేవారు. అభిమాన సంఘాల‌ను ప్రోత్స‌హించేవారు కాదు. ఎవ‌రైనా..సంఘం పెట్టుకుంటామంటే.. వ‌ద్ద‌ని కూడా చెప్పేవారు.

Mr Bharath | Telugu | Full Film | Rajnikant,Sathyaraj - video Dailymotion

దీనివ‌ల్ల శోభ‌న్‌బాబుకు పెద్ద‌గా సంఘాలు కూడా లేకుండా పోయాయి. ఇదిలావుంటే.. ఇండ‌స్ట్రీ విష‌యాని కి వ‌స్తే.. శోభ‌న్‌కు చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌లు ఉండేవి. వాటినిఆయ‌న తూచ త‌ప్ప‌కుండా పాటించేవారు. ఎవ‌రినీ ఆయ‌న లెక్క చేసేవారు. టైం అంటే.. టైమ్‌కు షూటింగ్ స్పాట్‌లో ఉండేవారు. అలానే.. త‌న‌కు అమ్మగా న‌టించిన వారితో ఆయ‌న హీరోయిన్‌గా న‌టించేవారు కాదు. అదేవిధంగా త‌న‌కు హీరోయిన్‌గా న‌టించిన వారితోనూ అమ్మ‌పాత్ర‌లను వేయించేవారు కాదు.

Bangaru Talli Telugu Full Movie || Jamuna, Jaggayya, Nagabhushanam,  Krishnam Raju, Shoban Babu - YouTube

సినిమాల్లో వ‌ర‌స‌లేంటి? అనే మాట‌ను శోభ‌న్‌బాబు ఒప్పుకొనేవారు. నిజ‌జీవితానికి.. సినిమాకు పెద్ద‌గా తేడాలేదు. అనేవారు. సినిమాలను బ‌ట్టే ప్ర‌జ‌లు కొన్ని కొన్నిఅనుక‌రిస్తారు. సినిమా ద్వారా.. అమ్మ‌కు.. పెళ్లానికి తేడాలేకుండా చేస్తే..అదే విచ్చ‌ల‌విడి అవుతుంది. కాబ‌ట్టి నేను చేయ‌ను అనేసేవారు. దీంతో శోభ‌న్‌బాబును ఇష్ట‌ప‌డిన వారు.. క్యారెక్ట‌ర్ల‌ను మార్చుకునేవారు.లేని వారు మాత్రం … ఆయ‌ననే ప‌క్క‌న పెట్టిన సంద‌ర్భాలు ఉన్నాయి.