బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లు అయిన వాళ్లు వీరే..!

సాధారణంగా చిత్ర పరిశ్రమలో రాణించాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. హీరోయిన్ అవ్వాలని చాలామంది అమ్మాయిలు ఆశపడుతూ ఉంటారు. వారి కలలను సాధించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక అలా ఎన్నో ప్రయత్నాలు చేసిన మాత్రాన ఎవరూ హీరోయిన్ల కాలేరు.

Sree Mukhi Movies, News, Photos, Age, Biography

హీరోయిన్ కావాలంటే అందం అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా కావాలి. అలా కొంతమంది పెద్దగా ప్రయత్నించకుండానే స్టార్ హీరోయిన్ అయిన వారు కూడా ఉన్నారు. చిత్ర పరిశ్రమలో బుల్లితెరపై యాంకర్ గా అడుగుపెట్టి ఆ తర్వాత స్టార్‌ల‌గా మారిన హీరోయిన్లు ఎవరో ?ఒకసారి చూద్దాం.

Niharika Konidela: Mega daughter shining in saree – Filmify Telugu

 

మెగా డాటర్ నిహారిక:
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఎవరు హీరోయిన్లుగా అడుగు పెట్టలేదు. మొదటిసారిగా హీరోయిన్‌గా అడుగుపెట్టింది నాగబాబు కూతురు నిహారిక. ఇక ఈమె ముందుగా బుల్లితెరపై ఓ డ్యాన్స్ షోకి యాంకర్ గా పని చేసింది. ఆ షోతో అందర్నీ ఆకట్టుకోగా ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా చిత్రపరిశ్ర‌మ‌లో అడుగు పెట్టింది.

Regina Cassandra trolled for this reason

 

రెజీనా:
స్టార్ హీరోయిన్ రెజీనా కూడా తన కెరీర్ ను యాంకరింగ్ ద్వారానే ప్రారంభించింది అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ముందుగా రెజీనా ఓ ఛానల్లో క్విజ్ ప్రోగ్రాం కి యాంకర్ గా చేసింది. ఆ తర్వాత కోలీవుడ్లో కందనాల్ ముదల్ సినిమాతో చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఇక ఆ సమయానికి ఈమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఇక టాలీవుడ్ లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన శివమనసులో శృతి సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగులో అడుగుపెట్టింది.

Swathi Reddy busy with comeback film!

కలర్ స్వాతి:
చిన్న వయసులోని బుల్లితెరపై ఓ ప్రముఖ ఛానల్‌కు కలర్స్ అనే ప్రోగ్రామ్ కి యాంకర్ గా పని చేసింది. ఆ ప్రోగ్రాం తోనే తెలుగులో మంచి పాపులారిటీని అందుకుంది. యాంకర్ గా వచ్చిన క్రేజీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. ఇక 2008లో నాని హీరోగా వచ్చిన అష్టా చెమ్మ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ వచ్చింది. తొలి సినిమాతోనే స్వాతి అందర్నీ ఆకట్టుకుని నంది అవార్డు కూడా దక్కించుకుంది.

Anchor Anasuya : అనసూయ ఏంటీ ఇంత అందంగా ఉన్నారు.. వైరల్ అవుతోన్న హాట్ యాంకర్  లేటెస్ట్ పిక్స్.. Anchor Anasuya looks ravishing in her latest pink saree  photoshoot pics goes viral– News18 Telugu

 

అనసూయ:
టాలీవుడ్‌లో స్టార్ యాంకర్ ఎవరంటే ముందుగా వినిపించే పేరు అనసూయ. ఇక ఈమె చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాతో అడుగుపెట్టింది. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై వచ్చే జబర్దస్త్ షోకి యాంకర్ గా ప్రవేశించింది. ఆ షో కి తన యాంకరింగ్‌తో స్టార్ స్టేటస్ తీసుకువచ్చింది. ఇప్పుడు టాలీవుడ్‌లో పాపుల‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయిపోయింది.

Nayanthara boyfriends and affairs| Nayanthara talks about love failures,  reveals why she broke up with the men in her life Prabhu Deva Simbu Vignesh  Shivan

న‌య‌న‌తార :
అస‌లు ఇప్పుడు సౌత్ ఇండియాను శాసిస్తోన్న న‌య‌న‌తార ముందుగా మ‌ల్లూవుడ్‌లో ఓ చిన్న ఛానెల్లో యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత ఆమె సినిమాల్లోకి వ‌చ్చి తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోయింది.