డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగం వ‌దిలేసుకుని సినిమాల్లోకి వ‌చ్చిన స్టార్లు వీళ్లే…!

డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగం. అంటే.. ఒక జిల్లాపై క‌లెక్ట‌ర్ త‌ర్వాత‌.. అంత‌టి అధికారం ఉన్న అధికారి. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే అవ‌కాశం ఉన్న ఉద్యోగం. ప్ర‌భుత్వం ఇచ్చే బంగ‌ళా కారు, ఇత‌ర సౌక‌ర్యాలు అన్నీ ఇన్నీ కావు. చెక్ ప‌వ‌ర్ దీనికి అద‌నం. అయితే.. కొంద‌రు క‌ళ‌ల‌పై ఉన్న ఆస‌క్తితో ఇలాంటి ఉద్యోగాల‌ను కూడా వ‌దులుకు సినిమాల బాట‌ప‌ట్టారంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది.

Tollywood Movie Actor Govindarajula Subba Rao Biography, News, Photos, Videos | NETTV4U

ఇలాంటి వారు తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా మంది ఉన్నారు. క‌ళా త‌ప‌స్వి కే. విశ్వ‌నాథ్ తీసిన శంక‌రాభ‌రణం సినిమాలో శంక‌ర శాస్త్రిపాత్ర‌ను పోషించిన జేవీ సోమ‌యాజులు.. డిప్యూటీ క‌లెక్ట‌ర్ అంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఆయ‌న డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా ఉండ‌గా.. విశ్వ‌నాథ్ ఓ సినిమా తీశారు. దీనికి ఆయ‌నే అనుమ‌తి ఇచ్చారు.

ఇలా ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం.. ఏకంగా సినిమా వ‌ర‌కు దారి తీసింది. వాస్త‌వానికి శంక‌రాభ‌ర‌ణం సినిమాను శోభ‌న్‌బాబుతో ప్లాన్ చేసుకున్నారు. ఆయ‌న వ‌ద్ద‌న్నారు. దీంతో సోమ‌యాజుల‌ను ప‌రిచ‌యం చేశారు. ఇక‌, డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా ఉంటూ.. సినిమాల్లోకి వ‌చ్చిన మ‌రో న‌టుడు గోవింద రాజుల సుబ్బారావు.

సుబ్బారావు వాస్త‌వానికి ఆయుర్వేద వైద్యులు. పైగా ప్ర‌భుత్వ వైద్యులు. త‌ర్వాత‌.. డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా అప్ప‌టి ఉమ్మ‌డి మ‌ద్రాస్ రాష్ట్రంలో ఉద్యోగం సంపాయించుకున్నారు. కానీ, సినిమాల‌పై మోజుతో ఆయ‌న త‌ర‌చుగా సెల‌వులు పెట్టేవారు. దీంతో ఆయ‌న‌ను సంజాయిషీ కోరారు. ఇక‌, త‌న‌కు ఉద్యోగానికి ప‌డ‌ద‌ని గ్ర‌హించిన సుబ్బారావు ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఇక సీనియ‌ర్ ఎన్టీఆర్ కూడా మంగ‌ళ‌గిరి స‌బ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు ఉద్యోగం వ‌దులుకుని సినిమాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఏకంగా ముఖ్య‌మంత్రి కూడా అయ్యారు.